Karthika Deepam : శివపార్వతుల్లా డాక్టర్ బాబు, వంటలక్క.. అదిరిపోయిన ప్రోమో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Deepam : శివపార్వతుల్లా డాక్టర్ బాబు, వంటలక్క.. అదిరిపోయిన ప్రోమో

Karthika Deepam : బుల్లితెరపై డాక్టర్ బాబు, వంటలక్క క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎప్పటికీ తగ్గదు. వారు లేకపోతే కార్తీక దీపం సీరియల్ ఎవ్వరూ పట్టించుకోరు అనేది అందరికీ అర్థమైంది. ఒకప్పుడు టీఆర్పీలకు రారాజులా ఉండే షో కాస్తా.. అభాసుపాలైంది. ఒకప్పుడు రెండి డిజిట్ల రేటింగ్ సాధించే కార్తీక దీపం.. వంటలక్క,డాక్టర్ బాబు మాయం అవ్వడంతో ఒకట్లో స్థానంలో రేటింగ్ పడిపోయింది. ప్రేమీ విశ్వనాథ్ వంటలక్క, దీపగా చేసిన మాయ.. డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ పరిటాల […]

 Authored By aruna | The Telugu News | Updated on :20 August 2022,12:20 pm

Karthika Deepam : బుల్లితెరపై డాక్టర్ బాబు, వంటలక్క క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎప్పటికీ తగ్గదు. వారు లేకపోతే కార్తీక దీపం సీరియల్ ఎవ్వరూ పట్టించుకోరు అనేది అందరికీ అర్థమైంది. ఒకప్పుడు టీఆర్పీలకు రారాజులా ఉండే షో కాస్తా.. అభాసుపాలైంది. ఒకప్పుడు రెండి డిజిట్ల రేటింగ్ సాధించే కార్తీక దీపం.. వంటలక్క,డాక్టర్ బాబు మాయం అవ్వడంతో ఒకట్లో స్థానంలో రేటింగ్ పడిపోయింది. ప్రేమీ విశ్వనాథ్ వంటలక్క, దీపగా చేసిన మాయ.. డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ పరిటాల యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయ్యా రు. అందుకే కార్తీకదీపం సీరియల్ ఆ రేంజ్‌లో హిట్ అయింది. ఇక మధ్య కొన్ని రోజులు ఆ పాత్రలను చంపేశారు. అంతా మార్చేశారు. జనరేషన్‌ను మార్చేశారు. కొత్తవాళ్లను పెట్టుకున్నారు. అయితే రేటింగ్స్ మాత్రం దారుణంగా పడిపోయాయి.

దీంతో చేసేదేం లేక మళ్లీ నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్‌లను తీసుకొచ్చారు. దీంతో రేటింగ్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఇప్పుడు వంటలక్క, డాక్టర్ బాబుల ఆగమనంతో సీరియల్ టాప్ రేటింగ్‌లోకి దూసుకెళ్తోంది. దీంతో వీరిద్దరితో మరిన్ని షోలు ఈవెంట్లు చేయాలని ఫిక్స్ అయింది స్టార్ మా. అందుకే ఈ సారి వినాయక చవితి ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసేందుకు రెడీ అయ్యారు. మాతో పండుగే పండుగ అంటూ చేయబోతోన్న ఈ ఈవెంట్‌లో డాక్టర్ బాబు శివుడిలా.. పార్వతీ దేవిలా వంటలక్క నటించింది. గణనాథుడి చరిత్రను బుల్లితెరపై ఆవిష్కరించేందుకు రెడీ అయ్యారు.

Nirupam As Shiva And Premi Viswanath As Parvathi In Star Maa Vinayaka Chavithi Event

Nirupam As Shiva And Premi Viswanath As Parvathi In Star Maa Vinayaka Chavithi Event

ఇక ఈ ఈవెంట్‌లో ఇధే హైలెట్ కానున్నట్టు కనిపిస్తోంది. శివుడి గెటప్‌లో నిరుపమ్ అద్భుతంగా అనిపిస్తే.. పార్వతీ మాతగా ప్రేమీ విశ్వనాథ్.. అందరూ దండం పెట్టి మొక్కేలా మెస్మరైజ్ చేసేసింది. మరి ఈ ఈవెంట్ ఎప్పుడు వస్తుంది.. ఇంకా ఏ ఏ కార్యక్రమాలున్నాయి.. ఎవరెవరు పాల్గొనబోతోన్నారనే విషయాలను మున్ముందు రివీల్ చేస్తారేమో. మరో వైపు ఈటీవీ కూడా వినాయకచవితి స్పెషల్ ఈవెంట్‌ను రంగంలో దించేందుకు రెడీ అయిందని సమాచారాం. కానీ డాక్టర్ బాబు, వంటలక్కలను ఢీ కొట్టగలవారెవ్వరున్నారనేది అనుమానం.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది