Home » Entertainment » Nirupam Paritala Doing Web Series And Open On Karthika Deepam Re Entry
Entertainment

Karthika Deepam Doctor Babu : వెబ్ సిరీస్‌లో డాక్టర్ బాబు.. కార్తీక దీపం రీ ఎంట్రీపై గుట్టు విప్పిన నిరుపమ్ పరిటాల

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: June 8, 2022 1:01 pm
Advertisement

Karthika Deepam Doctor Babu : బుల్లితెరపై శోభన్ బాబు అంటూ నిరుపమ్‌ పరిటాలకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. నిరుపమ్ నటించిన సీరియల్స్ అన్నీ కూడా హిట్ అయ్యాయి. ఇక కార్తీక దీపం సీరియల్‌లో కార్తీక్, డాక్టర్ బాబు పాత్రలతో అయితే తిరుగులేని స్టార్డం వచ్చింది. అలా బుల్లితెరపై నిరుపమ్ అంటే ఓ బ్రాండ్ అయ్యాడు. నిరుపమ్ లేకపోతే బుల్లితెర వెలవెలబోతోంది. చిన్నతెర చిన్నబోతోంది. కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్ బాబు పాత్రను చంపేశారు. కొత్త తరం వచ్చేసింది. నిరుపమ్ లేని సీరియల్‌ను ఊహించుకోవడం ప్రేక్షకులకు కష్టమవుతోంది. అయితే కొంత మంది మాత్రం డాక్టర్ బాబు ఇంకా తిరిగి వస్తాడని నమ్మకంతోనే ఉన్నారు.

Advertisement

ఆనంద్ రూపంలోనో, లేదా ఇంకా ఎక్కడైనా కోమాలో ఉన్నారేమో అని మధ్యలోకి ఆ పాత్రను తీసుకొస్తారేమోనని ఆశగా చూస్తున్నారు. అయితే ఇలా జనాల్లో ఉన్న అనుమానాలను తీర్చేందుకు నిరుపమ్ ముందుకు వచ్చాడు. తమ యూట్యూబ్ చానెల్ మంజుల నిరుపమ్‌లో ఓ వీడియో చేశారు. అందులో నెటిజన్లు తమను ఏవైతే ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నారో అడిగేయండి.. తాము అన్నింటికి సమాధానాలు చెబుతామని చెప్పుకొచ్చారు. అలా పెట్టిన కంటెస్ట్ బాగానే వర్కవుట్ అయింది. ఇక అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో వాటికి మంజుల, నిరుపమ్ ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. అందులో ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలకు ముందుగా సమాధానం ఇచ్చారు.

Nirupam Paritala Doing Web series And Open On Karthika Deepam Re Entry

Advertisement

కార్తీక దీపం సీరియల్‌లో మళ్లీ కనిపిస్తారా? ప్రస్తుతం ఏ సీరియల్ చేస్తున్నారు.. నెక్ట్స్ ప్లానింగ్ ఏంటి? అని అడిగారట. వీటికి నిరుపమ్ సమాధానాలు ఇచ్చాడు. నెక్ట్స్ సీరియల్ అంటే ఇప్పుడేం చేయడం లేదు. కానీ ఓ సీరియల్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నాను.. దాంట్లో మంజుల కూడా నటిస్తోందని అన్నాడు. ఇక ఈ గ్యాప్‌లో ఓ వెబ్ సిరీస్ చేశాను. మంచి ఓటీటీ సంస్థకు ఈ వెబ్ సిరీస్ చేశాను త్వరలోనే అనౌన్స్మెంట్ రాబోతోందన్నాడు. ఇంతకంటే ఇప్పుడు నేనేం చెప్పలేను అన్నాడు. ఇక కార్తీక దీపం సీరియల్‌లో అయితే కచ్చితంగా కనిపించను.. మళ్లీ ఆ పాత్ర ఉండదు.. ఇప్పుడొచ్చి ఆపెద్ద పిల్లల చేత తండ్రి అని పిలుపించుకోలేను అని అసలు విషయం చెప్పేశాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి