Prabhas : సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో ఫుల్ ఫాలోయింగ్ అందుకున్న నటి నిత్య మీనన్. మలయాళంలో బాల్య నటిగా అడుగుపెట్టి తెలుగులో అలా మొదలైంది చిత్రంలో తెరగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ పలు భాషల్లో ఎన్నో అవార్డులతో పాటు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే తాను కొత్తలో చేసిన ఓ పొరపాటు వల్ల తను చాలా బాధపడ్డాను అని నిత్య ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ జర్నలిస్టు తనను కన్ఫ్యూజ్ చేసి తనకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేశారని నిత్య వాపోయారు. మీడియా మీటింగ్ లో టాలీవుడ్ హీరోల ప్రస్తావన తీసుకు వచ్చిన ఓ జర్నలిస్టు… ప్రభాస్ గురించి చెప్పమని అడిగారని తెలిపింది.
అయితే అప్పటికి ప్రభాస్ తనకు తెలియదన్న నిత్య… టాలీవుడ్‌లోకి వచ్చిన కొత్తలో తనకు ఇండస్ట్రీ పై అంత అవగాహన లేదని అన్నారు. తెలుగు మూవీస్ చూసేదాన్ని అంటూ.. అయితే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య లాంటి వాళ్లు మాత్రమే తెలిసే వారని గుర్తు చేసుకుంది. కానీ ఇవన్నీ పట్టించుకోని జనాలు.. దాన్ని పెద్ద ఇష్యూ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనపై గిట్టని కొంత మంది తన అమాయకత్వాన్ని… తప్పులా చిత్రీకరించి తనకు పొగరు ఉన్నట్లుగా క్రియేట్ చేశారని వాపోయింది. ఆ వివాదం అనంతరం మీడియా ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. తెలుగులో అలా మొదలైంది సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిత్యా మీనన్… వెనువెంటనే బ్లాక్ బస్టర్ హిట్లతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది.
నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ.. మంచి నటిగా గుర్తింపు పొందింది. ఇష్క్, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, జనతా గ్యారేజ్, కథానాయకుడు, అ, సన్ ఆఫ్ సత్య మూర్తి, రుద్రమ దేవి వంటి పలు హిట్ చిత్రాలు ఈ అమ్మడి ఖాతాలో ఉన్నాయి. అయితే గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న నిత్యా మళ్ళీ వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా మారింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.