Prabhas : ప్రభాస్ ను కావాలని అనలేదు.. కావాలనే తనను బ్యాడ్ చేశారన్న నిత్యా మీనన్..!

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 11 December 2021, 8:15 am

Prabhas : సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో ఫుల్ ఫాలోయింగ్ అందుకున్న నటి నిత్య మీనన్. మలయాళంలో బాల్య నటిగా అడుగుపెట్టి తెలుగులో అలా మొదలైంది చిత్రంలో తెరగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ పలు భాషల్లో ఎన్నో అవార్డులతో పాటు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే తాను కొత్తలో చేసిన ఓ పొరపాటు వల్ల తను చాలా బాధపడ్డాను అని నిత్య ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ జర్నలిస్టు తనను కన్ఫ్యూజ్ చేసి తనకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేశారని నిత్య వాపోయారు. మీడియా మీటింగ్ లో టాలీవుడ్ హీరోల ప్రస్తావన తీసుకు వచ్చిన ఓ జర్నలిస్టు… ప్రభాస్ గురించి చెప్పమని అడిగారని తెలిపింది.

Prabhas : తన అమాయకత్వాన్ని తప్పులా చిత్రకరించారు..!

nithya menon responds over prabhas issue going viral in social media

nithya menon responds over prabhas issue going viral in social media

 అయితే అప్పటికి ప్రభాస్ తనకు తెలియదన్న నిత్య… టాలీవుడ్‌లోకి వచ్చిన కొత్తలో తనకు ఇండస్ట్రీ పై అంత అవగాహన లేదని అన్నారు. తెలుగు మూవీస్ చూసేదాన్ని అంటూ.. అయితే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య లాంటి వాళ్లు మాత్రమే తెలిసే వారని గుర్తు చేసుకుంది. కానీ ఇవన్నీ పట్టించుకోని జనాలు.. దాన్ని పెద్ద ఇష్యూ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనపై గిట్టని కొంత మంది తన అమాయకత్వాన్ని… తప్పులా చిత్రీకరించి తనకు పొగరు ఉన్నట్లుగా క్రియేట్ చేశారని వాపోయింది. ఆ వివాదం అనంతరం మీడియా ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది.  తెలుగులో అలా మొదలైంది సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిత్యా మీనన్… వెనువెంటనే బ్లాక్ బస్టర్ హిట్లతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది.

నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ.. మంచి నటిగా గుర్తింపు పొందింది. ఇష్క్, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, జనతా గ్యారేజ్, కథానాయకుడు, అ, సన్ ఆఫ్ సత్య మూర్తి, రుద్రమ దేవి వంటి పలు హిట్ చిత్రాలు ఈ అమ్మడి ఖాతాలో ఉన్నాయి. అయితే గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న నిత్యా మళ్ళీ వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా మారింది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp