Jabardast : జబర్దస్త్‌ ను లేపేందుకు స్పెషల్‌ స్కిట్స్‌.. ఈ కామెడీ షో పనైపోయిందా?

Authored By Himanshi | The Telugu News | Published on: March 6, 2022, 2:00 pm

jabardast : ఈటీవీ జబర్దస్త్ షో ఈ రోజు రోజుకి ఆదరణ తగ్గి పోతుందేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యూట్యూబ్ లో బాగానే చూస్తున్నారు కాని ఈ షో ను ఈ టీవీ ఛానల్ లో మాత్రం ఎక్కువగా చూస్తున్నట్లుగా అనిపించడం లేదు. అందుకే షో నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ కొత్త కొత్త ప్రయోగాలకు తెర తీస్తున్నారు. ఇటీవల కాలం లో కొత్త కామెడియన్స్‌ ఎక్కువగా గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలం అవుతున్నారు. హైపర్ ఆది మరియు సుడిగాలి సుదీర్ ఇంకా కొందరు తప్పితే జబర్దస్త్ మోసేవాళ్ళు లేకుండాపోయారు.ఈ సమయంలో స్పెషల్ స్కిట్ లు.. స్పెషల్‌ టీములు అని తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆ మధ్య డాన్స్ షో ఢీ నుండి ఒక ఒకరిద్దరు డాన్సర్స్ ను తీసుకు వచ్చి కామెడీ చేయించే ప్రయత్నాలు చేశారు. అది విఫలమవడంతో ఆ టీమ్ ను రద్దు చేశారు. ఇప్పుడు జబర్దస్త్‌ లోనే కొందరు కమెడియన్స్ ని తీసుకొని స్పెషల్ స్కిట్లు.. స్పెషల్ టీమ్స్ అంటూ తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయినా కూడా పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. హైపర్ ఆది ఎక్స్ ట్రా జబర్దస్త్ లో.. సుడిగాలి సుదీర్ జబర్దస్త్ లో తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.వీరిద్దరి వల్లే షో నడుస్తుంది కనుక అందులో ఇందులో రెండిట్లో కూడా వీరిద్దరూ ఉండేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైపర్ ఆది లేని ఎపిసోడ్ కి పెద్దగా ప్రేక్షకుల ఆదరణ దక్కడం లేదు. కనుక హైపర్ ఆది కి తగ్గట్లు గానే ఎపిసోడ్ యొక్క షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

no use with jabardast special skits and teams

no use with jabardast special skits and teams

సుడిగాలి సుదీర్ వరస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల అతడిని డాన్స్ షో ఢీ నుండి తప్పించి జబర్దస్త్ కి పరిమితం చేశారు. సుధీర్‌ కూడా తప్పుకుంటాడేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనుక అతనికి భారీగా పారితోషికం ఇస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కనుక జబర్దస్త్ ను జనాలు లైట్‌ తీసుకుంటున్నారు అనిపిస్తుంది. దాదాపు పదేళ్లు కావస్తున్నా జబర్దస్త్ పని అయిపోయిందేమో అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

Himanshi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp