Noel : హారిక పెళ్లికి అదే గిఫ్ట్.. నోయల్ కామెంట్స్ వైరల్
Noel : బిగ్ బాస్ ఇంట్లో ఏర్పడిన కొన్ని బంధాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. బిగ్ బాస్ కలిపిన మనుషుల్లో చాలా మంది ఇప్పటికే అంతే క్లోజ్‌గా ఉన్నారు. ఎప్పటికీ అలానే ఉంటారు కూడా. అయితే తాజాగా జరిగిన బిగ్ బాస్ ఉత్సవంలో నాల్గో సీజన్ కంటెస్టెంట్ల మధ్య ఉన్న ఎమోషన్స్ మరోసారి బయటకు వచ్చాయి. నోయల్ హారిక లాస్య అభిజిత్ ఓ గ్రూప్ అయినా కూడా మరీ ముఖ్యంగా నోయల్ హారిక మధ్య ఎక్కువగా క్లోజ్ […]
Noel : బిగ్ బాస్ ఇంట్లో ఏర్పడిన కొన్ని బంధాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. బిగ్ బాస్ కలిపిన మనుషుల్లో చాలా మంది ఇప్పటికే అంతే క్లోజ్‌గా ఉన్నారు. ఎప్పటికీ అలానే ఉంటారు కూడా. అయితే తాజాగా జరిగిన బిగ్ బాస్ ఉత్సవంలో నాల్గో సీజన్ కంటెస్టెంట్ల మధ్య ఉన్న ఎమోషన్స్ మరోసారి బయటకు వచ్చాయి. నోయల్ హారిక లాస్య అభిజిత్ ఓ గ్రూప్ అయినా కూడా మరీ ముఖ్యంగా నోయల్ హారిక మధ్య ఎక్కువగా క్లోజ్ నెస్ ఉంటుంది.
నోయల్‌ను తన ఇంటి సభ్యుడిగా, తండ్రిలాంటి వాడంటూ.. ఎంతో ఉన్నత స్థానంలో చూసుకుంటుంది హారిక. నోయల్ సైతం హారికను అదే విధంగా ఎంతో కేరింగ్‌గా చూసుకుంటాడు. బయటకు వచ్చాక నోయల్ ఆమెను ఎంతలా సపోర్ట్ చేస్తూ వచ్చాడో అందరికీ తెలిసిందే. అభిజిత్, హారికలను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఓట్లు వేయమని అడుగుతూ వచ్చేవాడు. అయితే హారిక నామినేషన్‌లో ఉన్న ప్రతీసారి నోయల్ ఓ బ్యాండ్‌ను కట్టేవాడట, అది ఇప్పటికీ ఆమె చేతికే ఉంటుందట.
తాను పెట్టుకున్న బ్యాండ్‌లను హారిక పెట్టుకుంటే మంచి జరుగుతందనే సెంటిమెంట్ వచ్చిందట. అందుకే నమ్మకం, ఆశ, కలలు కనాలి అనే బ్యాండ్‌లను హారిక చేతిక కట్టాడు. ఇంకో సపరేట్ బ్యాండ్‌ను కూడా కట్టేశాడు. అయితే ఇవన్నీ వట్టివే.. తన పెళ్లికి మాత్రం ప్లాటినం, డైమండ్‌లతో చేయించిన వాటిని ఇస్తాను అంటూ అందరి ముందే చెప్పేశాడు. అలా హారిక నోయల్ మధ్య ఉన్న బంధం మరోసారి ప్రేక్షకులు చూసినట్టైంది.