Nora Fatehi : పాలరాతి శిల్పంలా నోరా కటౌట్.. చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు
Nora Fatehi : మల్టీ టాలెంటెడ్ బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి అందరికీ సుపరిచితమే. డ్యాన్స్ ప్రియులకు నోరా అంటే ఎంతో ఇష్టం. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందచందాలతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ వయ్యారాలు ఒలకబోస్తోంది. నటిగా, డ్యాన్సర్, మోడల్, సింగర్, రియలిటీ షో జడ్జిగా అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది.
తెలుగులో టెంపర్ లో స్పెషల్ సాంగ్, కిక్2, లోఫర్, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడింది. ఇక ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్ లో తన అందాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ఈ కెనడా బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నోరా ఫతేహి హాట్ ఫొటో షూట్స్ తో అందరి చూపు తనవైపునకు తిప్పుకుంటోంది. ఎగిసి పడే ఎద అందాలు నోరా సొంతం.. అందుకే ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నోరా హాట్ ఫొటోలతో పాటు డ్యాన్స్ వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

Nora Fatehi Stunning Looks in Pink saree at Dance video
దీంతో సోషల్ మీడియాలో 40 మిలియన్స్ కి పైగా ఫాలోయివర్స్ ఉన్నారు. ఇక మలయాళంలో డబుల్ బ్యారెల్, కయంకుళం కోచున్నీ సినిమాల్లో నటించింది. అలాగే టీ సిరీస్ మూవీస్, మ్యూజిక్ వీడియోస్, వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌లో సందడి చేస్తోంది. కాగా నోరా రీసెంట్ గా తన అందాల ప్రదర్శనతో సందడి చేస్తోంది. లైట్ పింక్ కలర్ శారీలో అలా నడిచి వెళ్తూ కుర్రాల్ల గుండెలు జరిపోయేలా చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
https://www.youtube.com/watch?v=PHhQxPdxx8U&t=38s