ఆ ఇద్దరు తప్పా అందరూ.. అంతటా దిల్ రాజు బర్త్ డే టాపిక్.. !!
దిల్ రాజు సత్తా ఏంటో ఓ సారి జనాలకు, ఇండస్ట్రీకి చూపించాలని భావించాడో ఏమో గానీ సరైన సందర్భాన్ని పట్టేశాడు. దిల్ రాజు తన 50వ పుట్టిన రోజు వేడుకలను అందరూ అవాక్కయ్యేలా జరుపుకున్నాడు. అయితే మామూలుగానే దిల్ రాజు అంటే టాలీవుడ్ మొత్తానికి ఇష్టుడిగా ఉంటాడని, తాను తలుచుకుంటూ ఏదైనా చేయగలడు, ఎవరినైనా ఒప్పించగలడు, ఎవరి డేట్స్ అయినా పట్టేయగల సమర్థుడని అందరికీ తెలిసిందే. అలాంటి దిల్ రాజు లైఫ్‌లో ఈ ప్రత్యేక సందర్భాన్ని ఇంకెలా ప్లాన్ చేసి ఉంటాడో అందరూ ఊహించే ఉంటారు.

NTR And Allu Arjun Not Participated in Dil Raju 50th Birthday Celebrations
దాకిని పదింతలు మించేలా ఏర్పాట్లు చేశాడు. దిల్ రాజు బర్త్ డే పార్టీకి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరి నుంచి విశ్వక్ సేన్ వంటి కుర్ర హీరోలు కూడా వచ్చారు. దిల్ రాజు బ్యానర్‌లో పని చేసిన ఇప్పటి కుర్ర హీరోయిన్లందరూ విచ్చేశారు. ఇక ఈ ఈవెంట్‌లో అందరూ కలిసి ఫోటోలకు పోజులివ్వడం హైలెట్ అయింది. ప్రభాస్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, రామ్, నాగచైతన్య, మహేష్ బాబు ఇలా అందరూ ఒకే చోట కనిపించడంతో కన్నుల పండుగలా అనిపించింది. పైగా రాకీ భాయ్ యశ్ కూడా స్పెషల్ అట్రాక్ట్‌గా నిలిచాడు.

NTR And Allu Arjun Not Participated in Dil Raju 50th Birthday Celebrations
అయితే ఈ ఈవెంట్‌కు నందమూరి ఫ్యామిలీ దూరంగా ఉంది. అల్లు ఫ్యామిలీ కూడా దూరంగానే ఉంది. అయితే స్టార్ హీరోలందరూ అటెండ్ అయిన ఈవెంట్‌లో బన్నీ, ఎన్టీఆర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అయితే ఇందులో బన్నీ మాత్రం పుష్ప సినిమాలో బిజీగా ఉండటంతో రాలేకపోయి ఉండొచ్చు. మరో వైపు ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్‌లో బిజీగా ఉండటం మూలానే రాకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే మరి రామ్ చరణ్ మాత్రం హాజరవ్వడంతో అందరిలోనూ కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏది ఏమైనా కూడా దిల్ రాజు బర్త్ డే పార్టి మాత్రం ఎవ్వరూ మరిచిపోనంత గ్రాండ్‌గా జరిగింది.