jr Ntr : టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ( lakshmi pranathi )ల జోడి ఒకటి అనడంలో సందేహం లేదు. వీరిద్దరి పెళ్లి 2011 మే 6వ తారీఖున అత్యంత వైభవంగా జరిగింది. అప్పట్లో రాష్ట్రంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతి తో ఎన్టీఆర్ పెళ్లి ఫిక్స్ చేసింది చంద్రబాబు నాయుడు అంటూ అప్పట్లో ప్రచారం జరిగేది. అంతా అనుకున్నట్లుగానే చంద్రబాబు నాయుడు ఆ పెళ్లి దగ్గరుండి మరి చేసినట్లుగా ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. హైదరాబాద్ శివారు ప్రాంతంలో అత్యంత ఖరీదైన ల్యాండ్ బ్యాంక్ ఉన్న నార్నే వారి ఇంటి కూతురిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడం ద్వారా అప్పట్లోనే దాదాపు 250 కోట్ల రూపాయల కట్నం దక్కించుకున్నట్లుగా సమాచారం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
నార్నె ఫ్యామిలీ వారు లక్ష్మీ ప్రణతికి ఇచ్చిన కట్నం విలువ ఇప్పుడు దాదాపుగా రూ.1200 కోట్ల వరకు ఉంటుంది అనేది టాక్. ఆ విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ మరియు లక్ష్మీ ప్రణతిల వివాహం సమయంలో వయసు గురించి ప్రధానంగా చర్చ జరిగింది. ఎన్టీఆర్ ఒక చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ కొందరు యాంటీ నందమూరి ఫ్యాన్స్ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఎన్టీఆర్ మైనర్ బాలికను వివాహం చేసుకోబోతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అసలు మేటర్ ఏంటా అంటూ ఎంక్వౌయిరీ చేసిన మీడియా వాళ్లకు తెలిసిన విషయమేంటంటే లక్ష్మీ ప్రణతి పెళ్లి కాకముందే మేజర్ అయింది, కనుక ఎన్టీఆర్ మైనర్ ని వివాహం చేసుకోలేదు.
అప్పటి చట్ట ప్రకారం ఎన్టీఆర్ పెళ్లి జరిగింది… అయినా కూడా కొందరు అప్పట్లో తెగ హడావుడి చేసి ఎన్టీఆర్ ని ఇబ్బందుల పాలు చేసేందుకు ప్రయత్నించారు. ఎన్టీఆర్ ది ప్రేమ వివాహం కాకపోవచ్చు కానీ ఇద్దరు కూడా 12 సంవత్సరాలుగా ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటూ ప్రేమికుల కంటే ఎక్కువ ఆప్యాయతను పంచుకుంటున్నారు. వారిద్దరి ప్రేమకు సజీవ సాక్షంగా వారి ఇద్దరి కొడుకులు నిలుస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కట్నం విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ కి ఒక మంచి అమ్మాయి భార్యగా దక్కింది అంటూ అభిమానులు ఆనందించే విషయం. ఎన్టీఆర్ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. అయినా కూడా ఆమె ధైర్యంగా వెంట నిలిచి ఎన్టీఆర్ స్టార్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించారు అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ల జోడీ ఇలాగే నిండు నూరేళ్లు ఉండాలని వారి అభిమానులతో పాటు మా తరఫున కూడా ఆశిస్తున్నాం.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.