Jr NTR Devara : దేవర.. ఈ రికార్డులు ఏందయ్యా సామి..!
ప్రధానాంశాలు:
Jr NTR Devara : దేవర.. ఈ రికార్డులు ఏందయ్యా సామి..!
Jr NTR Devara : యంగ్ టైగర్ ఎన్ టీ ఆర్ దేవర సినిమా రిలీజ్ కు ముందే రికార్డులను కొల్లగొడుతుంది. సినిమా గురించి తెలుగు రెండు రాష్ట్రాల ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో అదే రేంజ్ లో ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. తెలుగులో ఎలాగైనా ఆడియన్స్ తారక్ మాస్ యుపోరుయాని ఎంజాయ్ చేస్తారని తెలిసే బియాండ్ ఫెస్ట్ 2024 లో పాల్గొనేందుకు రిలీజ్ ముందు లాస్ ఏంజిల్స్ వెళ్లాడు ఎన్ టీ ఆర్. దేవర వరల్డ్ వైడ్ గా ప్రీ బుకింగ్స్ అదిరిపోతున్నాయి.
ఇక నార్త్ అమెరికాలో అయితే ఏకంగా 2.5 మిలియన్ కలెక్ట్ చేసింది. సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ డే వసూలు చేయడం వేరు రిలీజ్ కు ముందు దేవర రికార్డులు సృష్టిస్తుంది. ఎన్ టీ ఆర్ దేవర అక్కడ ఇక్కడ అని కాదు అన్ని చోట్ల ఊర మాస్ జాతర అనిపించేలా చేస్తున్నాడు. నైజాం లో కూడా అత్యధిక షోస్ పడుతున్నాయి. ఏపీ లో అన్ని ఏరియాల్లో దేవర గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.
Jr NTR Devara మొదటి రోజు 100 కోట్లు గురి..
దేవర దూకుడు చూస్తుంటే ఫస్ట్ డే నే 100 కోట్లు కొల్లగొట్టేలా ఉంది. తప్పకుందా దేవర సినిమా ఎన్ టీ ఆర్ ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. తారక్ తో జాన్వి కపూర్ జత కట్టిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలనిజం కూడా వావ్ అనిపిస్తుందని అంటున్నారు. ఎన్ టీ ఆర్ దేవర లో డ్యుయల్ రోల్ చేశాడు.

Jr NTR Devara : దేవర.. ఈ రికార్డులు ఏందయ్యా సామి..!
జాన్వితో పాటుగా మరాఠి భామ శృతి మరాఠె కూడా ఈ సినిమాలో నటించింది. దేవర భార్యగా శృతి మరాఠె నటించింది. దేవర సినిమా క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. సినిమా లాస్ట్ హాఫ్ ఆన్ అవర్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు. మరి దేవర మీద ఉన్న ఈ సూపర్ బజ్ అంతా రేపు అనుకునట్టుగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో రికార్డులు సృష్టిస్తుందని చెప్పొచ్చు.