NTR : డాక్టర్ చదువు చదివి ఇండస్ట్రీకి వస్తానంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్
NTR : డాక్టర్ చదివి యాక్టర్ కావాలని, లేదంటే సినిమా పరిశ్రమలో ఏదో ఒక రంగంలో పని చేయాలని కలలు కనే వారు ఎందరో ఉన్నారు. అందులో ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి ఒకరు. కాట్రగడ్డ మురారి 1944 జూన్ 14న విజయవాడలో జన్మించారు. సినిమాలపై మక్కువతో డాక్టర్ (ఎంబీబీఎస్) చదువును మధ్యలోనే ఆపేసి చెన్నై వెళ్లారు. డైరెక్టర్ అవుదామనుకొని నిర్మాతగా మారారు. ‘యువచిత్ర ఆర్ట్స్’ పేరుతో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. గోరింటాకు, నారి నారి నడుమ మురారి, త్రిశూలం, అభిమన్యుడు, జానకిరాముడు చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.
ఆయన చెన్నైలోని తన నివాసం ‘నీలాంగరై’లో శనివారం (అక్టోబర్ 15) రాత్రి 8.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 78 ఏళ్లు. 90వ దశకం వరకు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కాట్రగడ్డ మురారి 2012లో ‘నవ్విపోదురు గాక’ పేరుతో ఆత్మకథ రాశారు.ఆయన హఠాన్మరణం ఎంతో మందిని కలిచి వేసింది. అయితే మురారి గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎంబీబీఎస్ చదివిన మురారికి ఎన్టీఆర్ ఓ సారి వార్నింగ్ ఇచ్చాడట. డాక్టర్ వృత్తిపై కంటే.. సినిమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుని మద్రాస్ వెళ్లి, ఆయన అక్కడ అనేక తిప్పులు పడ్డారు.ఇది తెలుసుకున్న ఎన్టీఆర్ వైద్య వృత్తిని వదిలేసి ఎందుకు వచ్చారు.. ప్రజలకు సేవ చేసే అవకాశం కోల్పోతున్నారు! అని చెప్పారట.
NTR : స్మూత్ వార్నింగ్..
ఓ సారి మురారి .. ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి సినిమాల్లోనే ఉండాలని.. ఈ ఇండస్ట్రీని వదిలి పెట్టడం తనకు ఇష్టం లేదని.. మురారి చెప్పడంతో.. ఆయనను ప్రోత్సహించాలని ఎన్టీఆర్ నిర్ణయించారట..బాలయ్యతో సినిమా తీస్తావా? అని అడిగే సరికి.. మురారి ఉబ్బితబ్బిబ్బయ్యారట. అయితే.. మొదట్లో ఇది సాధ్యం కాలేదు. దీంతో సహాయ దర్శకుడిగా ఆయన కెరీర్ ప్రారంభించారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మురారి నిర్మించిన జానకిరాముడు చిత్రం నాగార్జున, విజయశాంతి కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. సీతామహాలక్ష్మి, శ్రీనివాస కళ్యాణం, జేగంటలు ఆయన తీసిన మరికొన్ని సినిమాలు.