Nuvvu Nenu Prema 3 Aug Thursday Episode : పద్మావతి ఆత్మహత్య చేసుకుంటుందా.. తనను వెతుక్కుంటూ వెళ్లిన విక్కీ ఏం చేస్తాడు.. పద్దు కనిపిస్తుందా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Nuvvu Nenu Prema 3 Aug Thursday Episode : పద్మావతి ఆత్మహత్య చేసుకుంటుందా.. తనను వెతుక్కుంటూ వెళ్లిన విక్కీ ఏం చేస్తాడు.. పద్దు కనిపిస్తుందా?

Nuvvu Nenu Prema 3 Aug Thursday Episode : నువ్వు నేను ప్రేమ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 ఆగస్టు 2023 గురువారం ఎపిసోడ్ 379 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అమ్మవారి దగ్గరికి వెళ్లిన పద్మావతి ఇక నేను బతకను. నావల్ల కాదు. ఎవరి కోసం బతకాలి తల్లి. గుండెపగిలి నా బాధను రోజూ తట్టుకొని చస్తూ బతికే కంటే ఒకేసారి చావడం నయం అని అంటుంది పద్మావతి. అన్ని […]

 Authored By gatla | The Telugu News | Updated on :3 August 2023,9:00 am

Nuvvu Nenu Prema 3 Aug Thursday Episode : నువ్వు నేను ప్రేమ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 ఆగస్టు 2023 గురువారం ఎపిసోడ్ 379 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అమ్మవారి దగ్గరికి వెళ్లిన పద్మావతి ఇక నేను బతకను. నావల్ల కాదు. ఎవరి కోసం బతకాలి తల్లి. గుండెపగిలి నా బాధను రోజూ తట్టుకొని చస్తూ బతికే కంటే ఒకేసారి చావడం నయం అని అంటుంది పద్మావతి. అన్ని సమస్యలకు నా చావే పరిష్కారం. నేను చావాలి. నేను చస్తేనే అందరికీ మంచిది అని అనుకొని బ్యాగు తీసుకొని ఆవేశంతో ఓ కొండ ఎక్కుతుంది పద్మావతి. మరోవైపు విక్రమాదిత్య పద్మావతి ఫోటో చూపించి అందరినీ అడుగుతుంటాడు. కానీ.. ఎవ్వరూ తమకు తెలియదు అంటారు.

nuvvu nenu prema 3 august 2023 thursday 379 full episode

కోపంతో కొండ మీదికి ఎక్కుతుంది పద్మావతి. నిన్ను ఎక్కడ అని వెతకాలి. ఎక్కడున్నావు పద్మావతి అని కారులో వెళ్తుంటాడు. ఒకచోట కారు ఆపి.. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశారా అని అడుగుతాడు. దీంతో చూశాను. ఆ కొండ వైపు వెళ్తూ ఉంది. పాపం ఏడుస్తూ వెళ్తోంది అని ఓ వ్యక్తి చెప్పడంతో నో.. అలా జరగడానికి వీలు లేదు. పద్మావతి అంటూ తనను వెతుక్కుంటూ వెళ్తాడు విక్రమాదిత్య. మరోవైపు ఆవేశంతో కొండ ఎక్కుతూ ఉంటుంది పద్మావతి. చివరకు ఓ కొండ మీదికి ఎక్కి తన పాత మెమోరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది పద్మావతి. తనను అందరూ అవమానించడం గుర్తు చేసుకుంటుంది. చివరకు తన తండ్రి కూడా తనను అవమానించడంపై బాధపడుతుంది పద్మావతి. అమ్మా.. నాన్న.. నన్ను క్షమించండి. నేను చేయని తప్పుకు మిమ్మల్ని బాధపెడుతున్నాను. ప్రస్తుతం నేను జరిగింది చెప్పే పరిస్థితుల్లో లేను. అక్క పెళ్లి ఆగకూడదని నేను ఇదంతా చేశా. దానికి శిక్షగా నేను చావాలనుకుంటున్నా. మరో జన్మమంటూ ఉంటే మళ్లీ అనాథలా కాకుండా మీ కన్నబిడ్డలా పుట్టాలని కోరుకుంటున్నా అని ఆ దేవుడిని వేడుకొని దూకబోతుంది పద్మావతి.

Nuvvu Nenu Prema 3 Aug Thursday Episode : పద్మావతి కోసం పిచ్చోడిలా తిరిగిన విక్కీ

మరోవైపు పద్మావతి కోసం అక్కడా ఇక్కడా అంతా వెతుకుతాడు కానీ.. ఎక్కడా కనిపించదు. కానీ.. ఒక చోట కూర్చొని మిరపకాయ బజ్జీలు తింటూ ఉంటుంది పద్మావతి. బాధపడి చచ్చేదేలే.. బతికి నేనేంటో చూపిస్తా అని అనుకుంటుంది పద్మావతి. అక్క పెళ్లి ఆగకుండా ఉండటం కోసం పెళ్లి చేసుకున్నా కానీ.. అందరినీ బాధపెట్టాలని కాదు కదా. తప్పు చేసినోడు హాయిగా ఉంటే నేను దూకి చావాలా? ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఎన్న బాధలు వచ్చినా భయపడేదేలే.. ఆ టెంపరోన్ని ఉతుకుతా. శ్రీనివాసా క్షమించు అప్ప. క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా నాకు నువ్వే తోడు ఉండు అప్ప అంటూ బజ్జీలు తిన మంచినీళ్లు తాగుతుంది.

మరోవైపు పద్మావతి అంటూ కొండలు, గుట్టలు అన్నీ వెతుకుతూ ఉంటాడు విక్కీ. కానీ.. తను ఎక్కడా కనిపించదు. ఇంతలో ఓ వ్యక్తి వెళ్తుంటే ఈ అమ్మాయిని చూశారా అంటే అటు టెంపుల్ వైపు వెళ్లింది అని చెబుతాడు. దీంతో కారులో అటువైపు బయలుదేరుతాడు విక్కీ. ఇంతలో అను భర్త వస్తాడు. లక్ష్మీ పలకరిస్తుంది. పద్మావతి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. లేదండి అంటుంది.

ఇంతలో భక్త వస్తాడు. పద్మావతి గురించి మళ్లీ టాపిక్ వస్తుంది. తనకు, మాకు ఎలాంటి సంబంధం లేదు అంటారు. ఏ కారణంతో ఆ పని చేసిందో చెప్పమని అంటున్నం కదా. తను చెప్పకపోతే నలుగురిలో తల ఎత్తుకొని ఎలా బతకలం అంటాడు భక్త. దీంతో అలా అని పద్మావతిని వదిలేస్తారా అంటాడు అను భర్త. మరోవైపు గుడి దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది పద్మావతి. తనను వెతుక్కుంటూ వచ్చిన విక్కీని చూసి షాక్ అవుతుంది. తల్లీ నీదే భారం అని చెప్పి అతడి నుంచి తప్పించుకొని వెళ్తుంది పద్మావతి. ఇంతలో తనను పట్టుకుంటాడు విక్కీ. ప్రసాదం కూడా తిననివ్వడు. ఏంటమ్మా సాయం చేస్తావనుకుంటే ఇట్టా ఇరికించావు అని అనుకుంటుంది. ఏం చేయాలో తెలియదు పద్మావతికి. నన్ను టెన్షన్ పెడుతూ నువ్వు ప్రశాంతంగా ప్రసారం తింటున్నావా అంటాడు విక్కీ. నీకు కావాల్సినంత ప్రసాదం పెడతా పదా అంటాడు. దీంతో ఎక్కడికి అంటే.. ఇంటికి అంటాడు. దీంతో నేను రాను అంటుంది పద్మావతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది