Bigg Boss OTT Omkar : ఇక అరాచకమే.. తెలుగు ‘బిగ్ బాస్ ఓటీటీ’కి ఓంకార్ హోస్టింగ్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Bigg Boss OTT Omkar : ఇక అరాచకమే.. తెలుగు ‘బిగ్ బాస్ ఓటీటీ’కి ఓంకార్ హోస్టింగ్..!

Bigg Boss OTT Omkar : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ ఇటీవల పూర్తి అయిన సంగతి అందరికీ విదితమే. కాగా, త్వరలో మరో సీజన్ రాబోతుందని నాగార్జున ప్రకటించారు. ఈ క్రమంలోనే ‘బిగ్ బాస్ ఓటీటీ’ కూడా రాబోతుందని వార్తలొస్తున్నాయి. కాగా, ఓటీటీ రియాలిటీ షోకు ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు వార్తలొస్తున్నాయి. దాంతో పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాంకర్‌గానే కాకుండా డైరెక్టర్‌గానూ సత్తా చాటిన […]

 Authored By mallesh | The Telugu News | Updated on :30 December 2021,9:40 am

Bigg Boss OTT Omkar : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ ఇటీవల పూర్తి అయిన సంగతి అందరికీ విదితమే. కాగా, త్వరలో మరో సీజన్ రాబోతుందని నాగార్జున ప్రకటించారు. ఈ క్రమంలోనే ‘బిగ్ బాస్ ఓటీటీ’ కూడా రాబోతుందని వార్తలొస్తున్నాయి. కాగా, ఓటీటీ రియాలిటీ షోకు ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు వార్తలొస్తున్నాయి. దాంతో పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాంకర్‌గానే కాకుండా డైరెక్టర్‌గానూ సత్తా చాటిన బిగ్ బాస్ షోలోనూ అలరిస్తారని అంటున్నారు.ఓంకార్‌కు బుల్లితెరపైన ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తను హోస్ట్ చేసిన షోస్ అన్నిటినీ సింగిల్ హ్యాండ్‌తో డీల్ చేస్తారు ఓంకార్.

‘ఆట, ఇస్మార్ట్ జోడీ, సిక్స్త్ సెన్స్, మాయా ద్వీపం’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో టీఆర్పీ రేటింగ్స్ కొల్లగొట్టేస్తుంటారు ఓంకార్. ఓఏకే ఎంటర్ టైన్మెంట్స్ స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్నాడు ఓంకార్. ఇకపోతే ఓంకార్ చేతికి ఈ క్రమంలోనే ‘బిగ్ బాస్’ ఓటీటీ పగ్గాలు ఇవ్వబోతున్నారని టాక్. అదే కాని నిజం అయితే ‘ఓటీటీ బిగ్ బాస్’కూ యమ క్రేజ్ ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ముగిసిన వెంటనే మరో రెండు నెలల్లో న్యూ సీజన్ ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే ఓటీటీ బిగ్ బాస్ ఉంటుందని చెప్పారు. కాగా, సీజన్ 6కు కూడా తానే హోస్ట్‌గా వ్యవహరిస్తానని నాగార్జున తెలిపాడు.

omkar will be host for bigg boss 5 telugu ott season

omkar will be host for bigg boss 5 telugu ott season

 Bigg Boss OTT Omkar : ఓంకార్ సారథ్యంలో ఆటలో కీలక మార్పులు..!

కానీ, ఓటీటీ బిగ్ బాస్ గురించి తెలపలేదు. హిందీలో మాదిరిగా బిగ్ బాస్ ఓటీటీ తెలుగులోనూ డిఫరెంట్ హోస్ట్ ఉంటారని కొందరు గెస్ చేస్తున్నారు.హిందీ భాషలో ‘బిగ్ బాస్’ను సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తుండగా, ఓటీటీ బిగ్ బాస్‌ను కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. ఆ మాదిరిగానే తెలుగులో నాగార్జున సీజన్ 6 కు హోస్ట్‌గా ఉంటుండగా, ఓటీటీకి ఓంకార్ హోస్ట్ అవుతారని పలువురు చెప్తున్నారు. చూడాలి మరి.. ఈ వార్తలో నిజమెంత ఉంది అనేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ తర్వాతే తేలనుంది. ఇకపోతే ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా వెరీ డిఫరెంట్‌గా ఉంటారట. ఆ లిస్టులో అగ్గిపెట్టి మచ్చా, కత్తర్ పాప, యాంకర్ శివ, ఉప్పల్ బాలు తదితరులు ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది