Record Movie : వామ్మో.. 13 లక్షల బడ్జెట్.. 1647 కోట్ల వసూళ్లు.. రికార్డులను బద్ధలు కొట్టిన సినిమా..!
ప్రధానాంశాలు:
Record Movie : వామ్మో.. 13 లక్షల బడ్జెట్.. 1647 కోట్ల వసూళ్లు.. రికార్డులను బద్ధలు కొట్టిన ఒకేఒక్క సినిమా ఇది..!
Record Movie : టాలీవుడ్ నుంచి మొదలు పెడితే బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ ఇలా అన్ని సినీ పరిశ్రమలు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ప్రేక్షకులకు అందించాలని చూస్తారు. టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్న టైం లో ప్రతి సినీఅను బడ్జెట్ పెంచుతూ ప్రేక్షకులను మెప్పించేలా ప్రయత్నిస్తున్నారు. ఐతే మన దగ్గర వందల కొద్ది బడ్జెట్ తో తీసి 1000 కోట్లు వస్తెనే రికార్డ్ అని చెప్పుకుంటున్నారు. కానీ లక్షల్లో సినిమా తీసి వేల కోట్లు కొల్లగొట్టిన సినిమాలు ఉన్నాయి. ఇంతకీ ఏ సినిమా గురించి మనం చెప్పుకుంటున్నామో తెలుసా.. కేవలం 13 లక్షలతో తెరకెక్కిన ఆ సినిమా ఏకంగా 1647 కోట్లను వసూళు చేసి నెవర్ బిఫోర్ రికార్డ్ క్రియేట్ చేసిన పారానార్మల్ యాక్టివిటీ..
2007 లో ఓరెన్ పెలి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రొమాంటిక్, సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చి ప్రేక్షకులను సంబ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఈ సినిమాను దర్శకుడు కేవలం 13 లక్షల బడ్జెట్ తో హోం కెమెరాల్తో తీశాడు. సినిమా బడ్జెట్ ఎక్కువ అవుతుందని అందరు కొత్త వాళ్లతోనే తెరకెక్కించాడు. పారామౌంట్ పిక్చర్స్ బ్యానర్ లో కేవలం 2 లక్షల డాలర్లతో ఈ సినిమా తెరకెక్కించారు.
Record Movie బాక్సాఫీస్ దగ్గర 194 మిలియన్ డాలర్లను..
2007 లో మొదలు పెట్టిన ఈ సినిమా 2009 లో రిలీజైంది. ఈ సినిమా ఏకంగా బాక్సాఫీస్ దగ్గర 194 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 1647 కోట్ల రూపాయలు అన్నమాట. ఈ రేంజ్ లో వసూళ్లు చేయడం అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ఐతే వందల కోట్ళ బడ్జెట్ పెట్టి అంతకుమించి వసూలు రాబట్టిన సినిమాలు ఉన్నాయి కానీ కేవలం 13 లక్షల బడ్జెట్ తో ఇన్ని వందల కోట్లు రాబట్టడం అది ఈ సినిమాకే చెల్లింది.
హాలీవుడ్ లో వచ్చిన టైటానిక్, అవతార, అవెంజర్స్ లాంటి సినిమాల పక్కన ఈ సినిమా ఉంది. పార్నార్మ యాక్టివిటీ వీటి కన్నా ఎందుకు స్పెషల్ అంటే ఆ సినిమా బడ్జెట్ కేవలం 2 మిలియన్ డాలర్స్ మాత్రమే అవ్వడమే. తప్పకుండా ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావాలని కోరుతున్నారు ఆడియన్స్. Paranormal Activity Movie 1647 Crores Record Collections , Paranormal Activity Movie, 1647 Crores, Record Collections