Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట చిత్రంలో వైఎస్ జగన్ మాటలు పెట్టడానికి కారణం చెప్పిన దర్శకుడు
Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లామర్ బ్యూటీ కీర్తి సురేష్ ప్రధానా పాత్రలలో రూపొందుతున్న సర్కారు వారి పాట చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తైంది. మే 12న సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ నుండి టీజర్లు, పాటలు ఈ సినిమాలోని పాటలు అంచనాలను రెట్టింపు కాగా రీసెంట్‌గా మేకర్స్ ట్రయిల్ కూడా రిలీజ్ చేశారు. 105 షాట్స్ కాంబినేషన్‌లో విడుదలైన ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ అందరినీ అలరిస్తుంది. ఒక వైపు మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే కమర్షియల్ అంశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మాస్‌ను మెప్పించేలా పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ మోత మోగిపోగా ఒక్క డైలాగ్ మాత్రం అభిమానులతో పాటు ప్రేక్షకులలో చర్చకు దారి తీసింది.
సర్కారు వారి పాట’ ట్రైలర్‌ను గమనిస్తే ఇదొక పక్కా కమర్షియల్ మూవీ అని అర్థమవుతుంది. కానీ మహేష్ లుక్, యాక్టింగ్‌తో పాటు పరశురామ్ టేకింగ్ సినిమాకు ఎసెట్‌గా నిలిచిందని కనిపిస్తోంది. సినిమాలో డైలాగులు పీక్స్‌లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ట్రైలర్ విడుదలైనప్పుడు అందులోని ‘నేను విన్నాను నేను ఉన్నాను..’ డైలాగ్ తెగ వైరల్ అయ్యింది. ఈ మాటను దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అంటుండేవారు.ఆయన కుమారుడు వై.ఎస్.జగన్, ఏపీ సీఎంగా ఉండటంతో సదరు పార్టీ వర్గాలు కూడా డైలాగ్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి.

Sarkaru Vaari Paata parasuram clarity on YS Jagan dialogue
Sarkaru Vaari Paata : అసలు క్లారిటీ ఇది..
ఫ్యాన్స్, కామన్ ఆడియెన్‌తో పాటు అందరినీ ఆకట్టుకున్న ఆ డైలాగ్‌ను పరశురామ్ ఎందుకు రాయాల్సి వచ్చింది అనే సందేహం కూడా రాకపోలేదండోయ్.దీనిపై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఆయన చెప్పిన ‘నేను విన్నాను నేను ఉన్నాను..’ అనే మాట నాకెంతగానో నచ్చింది. చాలా పెద్ద మీనింగ్ ఉన్న దాన్ని చిన్నమాటగా భలే చెప్పారే అనిపించింది. అలాంటి సిట్యువేషన్ ‘సర్కారు వారి పాట’లోవచ్చినప్పుడు.. హీరో మహేష్‌గారు కీర్తి సురేష్‌కి మాట ఇవ్వాల్సి వచ్చినప్పుడు ‘నేను విన్నాను నేను ఉన్నాను..’ డైలాగ్ స్క్రిప్టులో రాసుకున్నాను. షూటింగ్ సమయంలోనూ మహేష్‌గారు అభ్యంతరం చెప్పలేదు’’ అన్నారు.