Patas Yadamma Raju : పటాస్ యాదమరాజు తీసుకున్న కష్టం ఎంతో తెలుసా?

 Authored By prabhas | The Telugu News | Updated on :5 January 2023,9:20 pm

Patas Yadamma Raju : మల్లెమాల వారి పటాస్ షో తో బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం అయిన కమెడియన్ యాదమరాజు. ఈయన పటాస్ షో నుండి తప్పుకున్న తర్వాత జీ తెలుగు మరియు స్టార్‌ మా ఛానల్స్ లో ప్రసారం అయిన కామెడీ షో ల్లో కనిపించాడు. ప్రస్తుతం ఈయన జబర్దస్త్‌ లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సద్దాం తో కలిసి టీమ్ లీడర్ గా యాదమ రాజు సందడి చేస్తున్నాడు. ఇటీవలే ఈయన ప్రేమించిన అమ్మాయి స్టెల్లా రాజ్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. స్టెల్లా రాజ్ సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే అందరికి సుపరిచితం. వీరి ప్రేమ వ్యవహారం

దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు సాగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరు ప్రస్తుతం కొత్త సంసారంను మొదలు పెట్టారు. ఈ సమయంలో యాదమ రాజు ఎంత కట్నం తీసుకున్నాడు అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అసలు యాదమ రాజు కట్నం ఏమీ తీసుకోలేదట. స్టెల్లా యొక్క కుటుంబ సభ్యులు ఆమెకు కొంత మొత్తంలో బంగారం ఇవ్వడంతో పాటు యాదమరాజుకు బంగారం పెట్టారట. అంతకు మించి కట్నం ప్రత్యేకంగా ఇవ్వలేదు అనేది టాక్‌. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్న యాదమ రాజును అభినందించాల్సిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న యాదమరాజు

Patas Yadamma Raju love marriage interesting rumors in tv industry

Patas Yadamma Raju love marriage interesting rumors in tv industry

దారిలోనే చాలా మంది జబర్దస్త్‌ కమెడియన్స్ అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలోనే హైపర్ ఆది యొక్క పెళ్లి కూడా అవ్వబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. యాదమరాజు మరియు స్టెలా లు హిందూ మరియు క్రిస్టియన్ సాంప్రదాయం లో పెళ్లి చేసుకున్నారు. యాదమరాజు హిందువు కాగా స్టెల్లా క్రిస్టియన్‌ అవ్వడం వల్ల రెండు పద్దతుల్లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు కూడా చాలా హ్యాపీగా వారి వైవాహిక జీవితంలో ముందుకు సాగుతున్నారు. వారి యొక్క వివాహ బంధం యూట్యూబ్‌ ద్వారా అందరు చూస్తూనే ఉన్నారు.

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి