
Pavala shyamala in a miserable condition
Pavala shyamala : దాదాపు 250 కి పైగా తెలుగు సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్న నటి పావలా శ్యామల ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎవరికైనా కళ్ళ వెంట నీరు రావాల్సిందే. ఇన్ని సినిమాలు చేసినా కూడా తను ఈరోజు ఉంటున్న ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది. తిండి కూడా కరువైంది. సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి ఎన్ని సినిమాలు చేసి ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నా కూడా కడుపు నింపుకోలేని పరిస్థితులు అనూహ్యంగా రావడం ఇప్పటికే ఎన్నో చూశాము. ఈ రంగుల ప్రపంచంలో మొహానికి రంగేసుకొని తెర మీద కనిపిస్తే మనం స్టార్స్ అని ఫీలవుతుంటాము.
Pavala shyamala in a miserable condition
కానీ రోజు వారి కూలిపని చేసుకునే వారికంటే అద్వానంగా కొందరి జీవితాలు ఉంటాయనే దానికి నేడు ప్రత్యక్ష ఉదాహరణ ఈ పెద్దావిడే. ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఆంధ్రావాలా సినిమాలో పావలా శ్యామల పాత్ర ఎంతగా నవ్విస్తుందో సినిమా చూసిన వాళ్లకి బాగా తెలుస్తుంది. నాని నటించిన నేను లోకల్, కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం, గోలీమార్, సూపర్ వంటి సినిమాలలో ఈమె పాత్రలు ఎంతో నవ్విస్తాయి. అలాంటి తన జీవితం కష్టాల కడలిలో కొట్టు మిట్టాడుతోంది.
అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు ఆర్ధిక సహాయం చేశాడని స్వయంగా తెలిపింది. మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఆర్ధిక సహాయం చేసినట్టు సమాచారం. ఇక ఎక్కువ సినిమాలు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసి పాపులర్ అయ్యారు.
Pavala shyamala in a miserable condition
కాగా ప్రస్తుతం ఆమె పరిస్థితి తెలుసుకున్న సినీ ప్రముఖులూ సహాయం అందించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. స్వయంగా తనతో ఇంటర్వ్యూ చేద్దామని ప్రయత్నిస్తున్న మీడియా వారికి కరోనా కారణంగా ఇంటి యజమాని అనుమతివ్వడం లేదట. ఇలాంటి వారికి అండగా ఇప్పుడు రియల్ హీరో సోనూసూద్ సహా పలువురు బాలీవుడ్, టాలీవుడ్ తారలు నిలుస్తున్నారు. వెంటనే స్పందించి పావల శ్యామలను ఆదుకుంటే ఒక ఆర్టిస్ట్ జీవితం కొత్తగా మొదలవుతుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.