young man marries two sisters in karnataka
అదృష్టం అందరికీ దొరకదు. అది కొందరికే చెందుతుంది. అయితే.. ఎప్పుడు ఎవరికి అదృష్టం ఎలా వచ్చి చేరుతుందో మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. అదృష్టం రావాలంటే నిజంగానే అదృష్టం ఉండాలి. లేకపోతే ఏం చేసినా అంతే. అదే అదృష్టం ఉన్నవాడు.. ఏది ముట్టుకున్నా బంగారమే అవుతుంది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో అదే జరిగింది. సాధారణంగా పెళ్లి ఎంతమందితో జరుగుతుంది ఒకరితోనే కదా. ఇద్దరిని పెళ్లి చేసుకునే హక్కు కూడా ఇప్పుడు మనకు లేదు. చట్టాలు ఒప్పుకోవు. కానీ.. నక్క తోక తొక్కి వస్తే.. అదృష్టం కలిసి వస్తే.. ఇద్దరేం ఖర్మ.. పది మందిని కూడా చేసుకోవచ్చు. తాజాగా కర్ణాటకలో అదే జరిగింది.
కర్ణాటకలోని తిమ్మరావుతనహళ్లి దగ్గర్లోని వేగమడుగు గ్రామంలో పెళ్లి జరుగుతోంది. ఊళ్లో పెళ్లి అంటే ఆ మాత్రం హడావుడి ఉంటుంది కదా. బంధువులు వస్తున్నారు.. ఓవైపు భోజనాలు.. మరోవైపు భజంత్రీలు.. అంతా హడావుడిగా ఉంది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ పీటల మీద కూర్చున్నారు. ఇక కాసేపు అయితే పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురుకు తాళి కడతాడు అనగా.. పెళ్లి కూతురు ఒక్కసారిగా సినిమా స్టయిల్ లో ఆపండి.. అంటూ అరిచింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఏమైంది అంటూ అడిగారు. ఈ పెళ్లి ఇష్టం లేదా? అని పెళ్లి కూతురును అడిగారు.
దీంతో.. పెళ్లి కూతురు.. తన చెల్లిని తీసుకొచ్చి.. తన చెల్లిని కూడా పెళ్లి కొడుకు పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. తన చెల్లిని పెళ్లి చేసుకుంటేనే తన మెడలో తాళి కట్టాలని.. లేదంటే ఈ పెళ్లి నాకు అవసరం లేదని తేల్చి చెప్పింది. దీంతో పెళ్లికొడుకుతో పాటు.. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. చెల్లిని కూడా పెళ్లి చేసుకోవడం ఏంటని బంధువులు కూడా ప్రశ్నించగా.. అప్పుడు అసలు విషయం చెప్పింది పెళ్లి కూతురు.
young man marries two sisters in karnataka
తన చెల్లి మూగదని.. మాట్లాడలేదని.. చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుందని.. ఇన్ని రోజులు తనను దగ్గరుండి చూసుకున్నానని.. తాను పెళ్లి చేసుకొని వెళ్లిపోతే.. తన ఆలనా పాలనా ఎవరు చూసుకుంటారని ప్రశ్నించింది. తల్లిదండ్రులకు రెక్కాడితే కాని డొక్కాడదు. అందుకే.. నా చెల్లి నాతో పాటే ఉండాలి. అందుకే నేను పెళ్లి చేసుకునే వ్యక్తితోనే నా చెల్లి పెళ్లి కూడా అయితే.. అప్పుడు ఇద్దరం ఒకే దగ్గర ఉంటాం. తన బాగోగులు నేను చూసుకుంటాను.. షరతు విధించగా.. తను అడిగిన దాంట్లో న్యాయం ఉండటంతో ఊరి పెద్దలతో పాటు.. బంధువులు అందరూ ఆ పెళ్లి కొడుకును ఈ పెళ్లికి ఒప్పించారు. దీంతో ముందు చెల్లికి తాళి కట్టి ఆ తర్వాత అక్కకు కూడా తాళి కట్టేసి.. ఇద్దరు భార్యలను చేసుకున్నాడు ఆ పెళ్లి కొడుకు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంతైనా పెళ్లికొడుకు అదృష్టవంతుడంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత…
This website uses cookies.