Pavala shyamala : దయనీయ స్థితిలో పావలా శ్యామలా.. పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆదుకున్నాడా..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Pavala shyamala : దయనీయ స్థితిలో పావలా శ్యామలా.. పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆదుకున్నాడా..!

Pavala shyamala : దాదాపు 250 కి పైగా తెలుగు సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్న నటి పావలా శ్యామల ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎవరికైనా కళ్ళ వెంట నీరు రావాల్సిందే. ఇన్ని సినిమాలు చేసినా కూడా తను ఈరోజు ఉంటున్న ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది. తిండి కూడా కరువైంది. సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి ఎన్ని సినిమాలు చేసి ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నా కూడా కడుపు నింపుకోలేని పరిస్థితులు అనూహ్యంగా […]

 Authored By govind | The Telugu News | Updated on :17 May 2021,2:15 pm

Pavala shyamala : దాదాపు 250 కి పైగా తెలుగు సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్న నటి పావలా శ్యామల ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎవరికైనా కళ్ళ వెంట నీరు రావాల్సిందే. ఇన్ని సినిమాలు చేసినా కూడా తను ఈరోజు ఉంటున్న ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది. తిండి కూడా కరువైంది. సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి ఎన్ని సినిమాలు చేసి ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నా కూడా కడుపు నింపుకోలేని పరిస్థితులు అనూహ్యంగా రావడం ఇప్పటికే ఎన్నో చూశాము. ఈ రంగుల ప్రపంచంలో మొహానికి రంగేసుకొని తెర మీద కనిపిస్తే మనం స్టార్స్ అని ఫీలవుతుంటాము.

Pavala shyamala in a miserable condition

Pavala shyamala in a miserable condition

కానీ రోజు వారి కూలిపని చేసుకునే వారికంటే అద్వానంగా కొందరి జీవితాలు ఉంటాయనే దానికి నేడు ప్రత్యక్ష ఉదాహరణ ఈ పెద్దావిడే. ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఆంధ్రావాలా సినిమాలో పావలా శ్యామల పాత్ర ఎంతగా నవ్విస్తుందో సినిమా చూసిన వాళ్లకి బాగా తెలుస్తుంది. నాని నటించిన నేను లోకల్, కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం, గోలీమార్, సూపర్ వంటి సినిమాలలో ఈమె పాత్రలు ఎంతో నవ్విస్తాయి. అలాంటి తన జీవితం కష్టాల కడలిలో కొట్టు మిట్టాడుతోంది.

Pavala shyamala : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు ఆర్ధిక సహాయం చేశాడని స్వయంగా తెలిపింది.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు ఆర్ధిక సహాయం చేశాడని స్వయంగా తెలిపింది. మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఆర్ధిక సహాయం చేసినట్టు సమాచారం. ఇక ఎక్కువ సినిమాలు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసి పాపులర్ అయ్యారు.

Pavala shyamala in a miserable condition

Pavala shyamala in a miserable condition

కాగా ప్రస్తుతం ఆమె పరిస్థితి తెలుసుకున్న సినీ ప్రముఖులూ సహాయం అందించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. స్వయంగా తనతో ఇంటర్వ్యూ చేద్దామని ప్రయత్నిస్తున్న మీడియా వారికి కరోనా కారణంగా ఇంటి యజమాని అనుమతివ్వడం లేదట. ఇలాంటి వారికి అండగా ఇప్పుడు రియల్ హీరో సోనూసూద్ సహా పలువురు బాలీవుడ్, టాలీవుడ్ తారలు నిలుస్తున్నారు. వెంటనే స్పందించి పావల శ్యామలను ఆదుకుంటే ఒక ఆర్టిస్ట్ జీవితం కొత్తగా మొదలవుతుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది