Pavitra Lokesh – Naresh : పవిత్ర లోకేష్ తో నరేష్ లిప్ లాక్ .. దాని గురించి పబ్లిక్ లో అడిగితే ఏమన్నారో చూడండి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pavitra Lokesh – Naresh : పవిత్ర లోకేష్ తో నరేష్ లిప్ లాక్ .. దాని గురించి పబ్లిక్ లో అడిగితే ఏమన్నారో చూడండి !

 Authored By aruna | The Telugu News | Updated on :21 May 2023,6:56 pm

Pavitra Lokesh – Naresh : సీనియర్ నటుడు నరేష్ నటి పవిత్ర గురించి సోషల్ మీడియాలో ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. నరేష్ మూడో భార్యను వదిలేసి పవిత్రతో సహజీవనం చేస్తున్నాడని, పవిత్ర కూడా తన భర్తను వదిలేసి నరేష్ తో కలిసి ఉంటుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. దానిని ‘ మళ్లీ పెళ్లి ‘ సినిమా ద్వారా కన్ఫామ్ చేశారు. ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. వారిద్దరు నిజంగా పెళ్లి చేసుకున్నారేమో అని అనుకున్నారు. కానీ అది సినిమా అని చివరికి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. వారిద్దరి మధ్య పరిచయం వారి వ్యక్తిగత జీవితాల్లో

ఎదుర్కొన్న సమస్యలు అన్నింటిని ఈ సినిమాలో చూపిస్తారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ లో పవిత్ర నరేష్ లిప్ లాక్ చేసుకున్నారు. దీంతో పెద్ద వివాదస్పదమైంది. ఓ ఇంటర్వ్యూలో నరేష్ ని లిప్ లాక్ విషయం గురించి అడగగా దానికి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 20 ఏళ్ల వాళ్లే లిప్ లాక్ పెట్టుకోవాలా, 60 ఏళ్ల వాళ్ళు లిప్ లాక్ పెట్టుకోకూడదా అని ప్రశ్నించాడు. ఇక మీరిద్దరూ జీవితాంతం కలిసి ఉంటారని గ్యారెంటీ ఏంటి ఆయన జీవితంలోకి ఒక స్త్రీ, ఆమె జీవితంలో ఒక వ్యక్తి రాడని నమ్మకం ఏంటి అని అడిగారు. అయితే తాను పక్కన ఉండగా నరేష్ మరో స్త్రీని చూడడు అంటూ పవిత్ర చెప్పింది.

Pavitra Lokesh Naresh

Pavitra Lokesh – Naresh

ఇప్పటి వరకు ఇది ప్రోమో మాత్రమే. ప్రోమో చూసి జనాలు షాక్ అయిపోతున్నారు. పూర్తి ఇంటర్వ్యూ త్వరలో రానుందట. ఈ విషయాన్ని దేవి నాగవల్లి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీంతో నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వేస్ట్ వాళ్ళతో ఇంటర్వ్యూ ఏంటి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మీకు వేరే న్యూస్ లేవా చూపించడానికి వీళ్ళే దొరికారా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నరేష్ పవిత్ర లు అంటే జనాలకు పిచ్చి కోపం వస్తుంది. ఈ ఏజ్ లో వీళ్లకు మళ్లీ పెళ్ళి ఏంటి చిరాక్ గా అని నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది