Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – రేణూ దేశాయ్ మధ్య వార్.. ఎవరు అబద్దాలు చెబుతున్నారు..!
Pawan Kalyan : ఇటీవల పవన్ హాట్ టాపిక్‌గా మారుతున్న విషయం తెలిసిందే. ఆయనపై వైసీపీ నాయకులు విమర్శలు చేయడంతో పాటు పదే పదే మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తెస్తున్నారు. నిలకడలేని పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. భార్య ఉండగానే మరో యువతితో సంబంధం పెట్టుకొని పిల్లల్ని కన్నాడని ఆరోపిస్తూ ఉంటారు. అప్పట్లో రేణూ దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో పవన్ నాతో కాపురం చేస్తూనే మరో అమ్మాయితో పిల్లల్ని కన్నాడని కామెంట్ చేయడం ఆయనకు మైనస్ గా మారింది. ఇదే అవకాశంగా తీసుకొని వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో పవన్ మాట్లాడుతూ.. మూడు పెళ్లిళ్లు అని అంటున్నారు సరదాగా ఉంటే మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారు.
ఒక పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలను మెయింటైన్ చేస్తున్న వాళ్లు చాలామంది ఉన్నారు. అంటూ గాటుగా స్పందించాడు. మొదటి భార్యకు ఐదు కోట్లు ఇచ్చానని, రెండో భార్యకు తన ఆస్తిలో సగం ఇచ్చానని…. రెండో భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతే మూడో పెళ్లి చేసుకున్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నందినికి భరణంగా ఎంత ఇచ్చారన్నది ఆమెకు మాత్రమే తెలిసిన నిజం. ఫస్ట్ టైం నందినికి రూ. 5 కోట్లు చెల్లించినట్లు పవన్ బయటపడ్డారు. అది ఓకే కానీ రేణూ విషయంలోనే ఆయన కామెంట్ కరెక్ట్ గా లేదు. 2012లో రేణూ దేశాయ్ కి విడాకులు ఇచ్చిన పవన్ తన ఆస్తి మొత్తం రాసిచ్చాను అన్నాడు. నందినికి పిల్లలు లేరు కానీ రేణూ దేశాయ్ కి ఒక అమ్మాయి, అబ్బాయి పుట్టారు.

pawan kalyan and renu desai alimony issue viral
Pawan Kalyan : ఏది నిజం..
విడాకులు తీసుకున్నందుకు కోట్ల ఆస్తి అప్పగిస్తే రేణూ మాత్రం చిల్లి గవ్వ ఇవ్వలేదని అనేక ఇంటర్వ్యూలలో చెప్పింది. మరి పవన్ ఇచ్చిన అంటుంటే రేణూ మాత్రం తీసుకోలేదని అంటుంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు చెప్పేది కరెక్ట్ అనేది ఎవరికి అర్ధం కాకుండా ఉంది. పవన్ కళ్యాణ్ మొదటి భార్యతో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ లకు ఇద్దరు సంతానం ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అన్నా లేజోనోవాను వివాహం చేసుకున్న సమయంలో రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చారు. అయితే విడాకుల సమయంలో రేణు దేశాయ్ చాలా భరణం తీసుకున్నారని వార్తలు వినిపించాయి. కాని అవన్నీ అవాస్తవాలు అని చెప్పింది.