Pawan Kalyan : దటీజ్ పవన్ కళ్యాణ్.. కింద పడిన పోలీస్‌కి చేయి అందించిన పవన్
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు చేస్తూ మరో వైపు రాజకీయాలతో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్రను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసా కల్పించడానికి రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తానని ఉగాది పండుగ నాడు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించారు పవన్ కళ్యాణ్.
పవన్ రావడంతో జనసైనికులతో పశ్చిమగోదావరి జిల్లా నిండిపోయింది . పవన్ ను చూడడానికి అభిమానులు పోటెత్తారు. దీంతో పోలీసులు ఎంత బందోబస్త్ పెట్టిన వారిని ఆపడం కష్టతరం అయ్యింది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ పోలీసుల బందోబస్త్ మధ్య వెళ్తుండగా జనసందోహం ఎక్కువ కావడంతో ఒక పోలీస్ అదుపుతప్పి పడిపోయాడు.. దీంతో వెంటనే పవన్ స్పందించి అంతమందిని దాటుకొని పోలీసును లేపి.. జాగ్రత్త చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా పవన్ మంచితనంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
దటీజ్ పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను టాలీవుడ్ నిర్మాత ఎస్ కె ఎన్ షేర్ చేస్తూ ఆ వ్యక్తిత్వం కు చప్పట్లు అంటూ చెప్పుకొచ్చాడు. పశ్చిమ గోదావరి జిల్లా జానంపేటలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న మల్లికార్జునరావు అనే రైతు కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును అందించారు పవన్ కళ్యాణ్. తాను ఎల్లవేళలా అండగా ఉంటానని రైతుల కుటుంబానికి భరోసానిచ్చారు పవన్. ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకపోయిన తమ అధినేత రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నారని పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపొంది అధికారం చేపడతామని జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆ వ్యక్తిత్వం ????????????@PawanKalyan గారు ???? pic.twitter.com/4GGWMorS40
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) April 23, 2022