Pawan kalyan : అఖండ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఇదెక్క‌డి న్యాయం..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan kalyan : అఖండ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఇదెక్క‌డి న్యాయం..?

 Authored By kranthi | The Telugu News | Updated on :3 December 2021,4:20 pm

Pawan kalyan ఆంధ్రప్రదేశ్‌లో బెన్ ఫిట్ షో ల రద్దు అనేది నోటి మాట మాత్రమే అని మరోసారి రుజువు అయింది. ఏపీ లో ఏ భారీ చిత్రం విడుదల అయిన ఆ ముందు రోజు అర్ధరాత్రి నుంచే అభిమానుల హంగామా షురూ అవుతుంది. బెన్ ఫిట్ షో ల పేరిట తెల్లవారు జామునే అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు క్యూ కడుతూ ఉంటారు. అయితే ఏపీ ప్రభుత్వం నిర్ణయం మేరకు… లాస్ట్ సమ్మర్ లో విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’కు ఏర్పాటు చేసిన బెనిఫిట్ షోలన్నీ రద్దయిపోయాయి. తీరా సినిమా విడుదల అయ్యే సమయానికి ప్రభుత్వం ఇలా కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో అప్పట్లో పవన్ అభిమానుల ప్రభుత్వం ఫైర్ అయ్యారు. రాజకీయాలను సినిమాలతో ముడి పెడుతున్నారంటూ మండి పడ్డారు.

పవన్ ను రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాక ఆయన సినిమాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా.. ఇకపై బెనిఫిట్ షోలనేవే ఉండవని తేల్చేస్తూ జీవోను రిలీజ్ చేసింది. రోజుకు 4 షోలు మాత్రమే ఉంటాయని.. అదనపు షోలకు ఛాన్స్ లేదని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో బాలయ్య ‘అఖండ’ సినిమా విషయంలో ఏం జరుగుతుందొనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. అఖండకు.. బెనిఫిట్ షోలు ఉండవని అంతా భావించారు. కానీ వారి ఊహలకు బ్రేక్ వేస్తూ ఏపీలో నిన్న అనేక చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. తిరుపతి పట్టణం అయితే దాదాపు అన్ని థియేటర్‌లోనూ అఖండకు స్పెషల్ షోలు రన్ చేస్తున్నారు. దీనిపై పవన్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.

Pawan kalyan fans fires on ap govt to akhanda Movie

Pawan kalyan fans fires on ap govt to akhanda Movie

Pawan kalyan బాలయ్యకు పర్మిషన్ ఇచ్చి పవన్ ను మాత్రమే టార్గెట్ చేస్తారా..!

పవన్ కొక న్యాయం బాలయ్య కొక న్యాయమా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం వైపు నుంచి డిస్ట్రిబ్యూటర్లకు పెద్దగా అభ్యంతరాలు రావాట్లేవని సమాచారం. ఇలాగే కొనసాగితే తర్వాతి భారీ చిత్రం ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్‌’కు కూడా ఈ సమస్య తొలగిపోయినట్లే. అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే బాలయ్య సినిమాకు పర్మిషన్ ఇచ్చినట్లే పవన్ కళ్యాణ్ సినిమా ‘భీమ్లా నాయక్’ కు కూడా ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ‘వకీల్ సాబ్’ను టార్గెట్ చేసినట్లే ఉద్దేశపూర్వకంగా ఈసారి కూడా టార్గెట్ చేస్తే పవన్ అభిమానుల నుంచి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం తప్పదనే చెప్పాలి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది