
pawan kalyan fans fires on rajamouli tweets over bheemla naik
Pawan kalyan : పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్ సినిమా పోస్ట్ పోన్ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఊహాగానాలను నిజం చేస్తూ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమా కాస్త ఫిబ్రవరి 25వ తేదీకి షిఫ్ట్ అయింది. దీంతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. చివరి క్షణంలో వాయిదా వేయడం సరికాదంటూ సినీ టీమ్ పై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పోస్ట్ పోన్ వెనుక దిల్ రాజు స్వార్థం ఉందని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ఇదే సమయంలో దర్శకుడు రాజమౌళి చేసిన ట్వీట్స్ మరో సరికొత్త వివాదానికి తెర లేపాయి.
pawan kalyan fans fires on rajamouli tweets over bheemla naik
భీమ్లా నాయక్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికే.. రాజమౌళి చేసిన ట్వీట్స్ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని రెట్టింపు చేశాయి. మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ చేసినందుకు నిర్మాత చినబాబు, పవన్ కళ్యాణ్ అభినందనీయులు అంటూ రాజమౌళి చేసిన కామెంట్ పై పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనపై విరుచుకు పడ్డారు. ఆర్ ఆర్ ఆర్ కోసం.. సంక్రాంతి బరి నుంచి ఆఖరి నిమిషంలో భీమ్లా నాయక్ ను తప్పించారని ఆరోపిస్తూ రాజమౌళి పై మండి పడుతున్నారు.ఇదిలా ఉండగా.. రాజమౌళి మరో ట్వీట్ కూడా చేశారు. నా హీరో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ను ఆర్ ఆర్ ఆర్ కు పోటీగా రిలీజ్ చేయవద్దని నిర్ణయం తీసుకున్నందుకు థ్యాంక్స్ అంటూ జక్కన్న చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.
అంతటితో ఆగక.. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న F3 సినిమా రిలీజ్ డేట్‌ను ఫిబ్రవరి 25 నుంచి ఎప్రిల్ 29వ తేదీకి మార్చడంపై కూడా రాజమౌళి థ్యాంక్స్ చెప్పారు. ఇదంతా గమనిస్తున్న సినీ అభిమానులు.. మీ ఒక్క సినిమా కోసం మా అభిమాన హీరోల మూవీలను మీరే దగ్గరుండి పోస్ట్ పోన్ చేయిస్తున్నారా అని ఆయనను నిలదీస్తున్నారు. ఈ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ రచ్చ చూస్తూ ఉంటే.. ఇప్పుడీ వివాదం ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.