Pawan Kalyan – Mahesh Babu : పవన్ ఫ్యాన్స్ వర్సెస్ మహేష్ ఫ్యాన్స్, పోకిరి వర్సెస్ జల్సా.. ఎవరిది పై చేయి అయ్యిందంటే!
Pawan Kalyan – Mahesh Babu : టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు తమ అభిమానంను చూపించుకునేందుకు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. ఇటీవల మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు పోకిరి సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో భారీ ఎత్తున రిలీస్ చేసిన విషయం తెలిసిందే. దాంతో దాదాపుగా కోటి రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ నమోదు అయినట్లుగా సమాచారం అందింది. పోకిరి సినిమాతో పాటు ఒక్కడు సినిమా కూడా మహేష్ అభిమానులు రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. రెండు సినిమాలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఘరానా మొగుడు సినిమాను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాను ఆయన బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ ఒకటో తారీఖున తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 స్క్రీన్స్ లో స్క్రీనింగ్ చేయబోతున్నట్లుగా మెగా అభిమానులు తెలియజేశారు. గీత ఆర్ట్స్ బ్యానర్లో రూపొందిన జల్సా సినిమాకి ఇప్పటికే 4కే టెక్నాలజీతో సౌండ్ సిస్టం ని మార్చారు. అంతే కాకుండా తాజాగా ట్రైలర్ ని కూడా విడుదల చేసి సరికొత్త అనుభూతిని పవన్ కళ్యాణ్ కి మరియు ఆయన అభిమానులకు అందించారు. ఇప్పుడు పోకిరి రికార్డును బద్దలు కొట్టేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
పోకిరి సినిమాతో కోటి రూపాయల వరకు వసూళ్లునమోదు అయ్యాయి అని సమాచారం అందుతుంది. ఇప్పుడు జల్సా సినిమాకు ఏకంగా కోటి 25 లక్షల రూపాయలు నమోదు అయ్యేలా పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే భారీ ఎత్తున జల్సా సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. కచ్చితంగా విడుదల సమయానికి ఓ రేంజ్ లో సినిమా స్క్రీన్స్ సంఖ్య పెరగడంతో పాటు భారీ ఎత్తున వసూళ్లు కూడా వచ్చే అవకాశం ఉందని మెగా అభిమానులు ధీమాతో ఉన్నారు. తప్పకుండా మహేష్ బాబు ఫ్యాన్స్ పోకిరి సినిమాకు చేసిన హడావుడి పై తమదే పై చేయి అవుతుంది అంటూ మెగా ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ ఫ్యాన్స్ గొడవ ఏమో కానీ నిర్మాతలకు పంట పండుతోంది.