Hari Hara Veera Mallu : మొఘలుల గొప్పదనం చెప్పారు కాని, వారి అరాచకం చెప్పలేదు.. అదే హరిహర వీరమల్లు.. పవన్ కళ్యాణ్..!
ప్రధానాంశాలు:
Hari Hara Veera Mallu : మొఘలుల గొప్పదనం చెప్పారు కాని, వారి అరాచకం చెప్పలేదు.. అదే హరిహర వీరమల్లు.. పవన్ కళ్యాణ్..!
Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా కోసం రోజుకి రెండు గంటలే సమయం కేటాయిస్తానని చెప్పా.. ఏడు నుంచి తొమ్మిది వరకు… ఇచ్చా. వారానికి ఐదు రోజులు ఇచ్చా అన్నారు పవన్. ఇక నిధి అగర్వాల్‌ని చూసి సిగ్గు తెచ్చుకుని ప్రమోషన్లకు వచ్చా.

Hari Hara Veera Mallu : మొఘలుల గొప్పదనం చెప్పారు కాని, వారి అరాచకం చెప్పలేదు.. అదే హరిహర వీరమల్లు.. పవన్ కళ్యాణ్..!
Hari Hara Veera Mallu : ధర్మాన్ని చెప్పా..
ఈ సినిమాకు హీరో నేనే.. అందుకే మీడియా ఇంటరాక్షన్ చేశా.. రేపూ, ఎల్లుండి కూడా మీడియా ఇంటరాక్షన్ చేస్తా. ప్రభుత్వం మనది వచ్చింది.. మన సినిమా రిలీజ్ అవుతుంది. భీమ్లానాయక్‌ని పంతం కోసం చూశారు. హరిహరవీరమల్లు నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అన్నారు పవన్ . అదేవిధంగా భారత్ ఎవరినీ ఆక్రమించలేదు. ఈ దేశాన్ని అందరూ ఆక్రమించుకున్నారు.
మొఘల్ తాలూకు అరాచకాన్ని ఎప్పుడూ చెప్పలేదు. ఛత్రపతి శివాజీలాంటి కథను చెప్పాలనిపించింది. హరిహర వీరమల్లు కల్పిత పాత్ర. సగటు మనిషి ఏం చేసి ఉండొచ్చన్నదే కథ. కోహినూర్‌ని దృష్టిలో పెట్టుకుని క్రిష్‌గారు కథ చెప్పినప్పుడు నచ్చింది. ఈ సినిమా చేసినప్పుడు చాలా నలిగాం. ఎన్ని రికార్డులు చేస్తుందో చెప్పలేను. బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాను. డ్యాన్సులు కూడా చేశాను.. కాలు కదిల్చాను. రియల లైఫ్ రౌడీలను ఎదుర్కొన్నా.. ధర్మాన్ని చెప్పే మూవీ ఇది. 10, 15 రూపాయలతోనూ మనం కలెక్షన్లను చూశాం అన్నారు పవన్.