అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కొత్త సినిమా లో పవన్ కళ్యాణ్ ??
టాలీవుడ్ స్టార్ దర్శకులలో ఒకరు త్రివిక్రమ్. ప్రతి సినిమాలో తనదైన స్టైల్ లో డైలాగ్స్, స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఇక త్రివిక్రమ్ ఒక్క హీరో తోనే మూడు నాలుగు సినిమాలు చేస్తూ ఉంటారు. దీంతో హీరో, డైరెక్టర్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఏర్పడుతుంది. ఆల్రెడీ ఇండస్ట్రీలో త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో సినిమాలు వచ్చాయి. ఇవన్నీ కూడా బ్లాక్ బస్టర్ హీట్ అయినవే. అయితే తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో నాలుగో సినిమా రాబోతుందని సమాచారం.
ఈ సినిమా గురించి మరికొన్ని క్రేజీ రూమర్ లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పదినిమిషాల నిడివి ఉన్న అతిధి పాత్రలో నటించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ అవ్వడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. రీఎంట్రీ తర్వాత ఆయన సినిమాలన్నీ త్రివిక్రమ్ దగ్గరుండి మరి సెట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చివరి సినిమా భఈమ్లఆ నాయక్ సినిమాకి త్రివిక్రమ్ నే అనధికార దర్శకుడు .
ఇక ఇప్పుడు రీసెంట్ గా విడుదల అవ్వబోతున్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా ‘ బ్రో ది అవతార్ ‘ సినిమాకి కూడా ఆయన మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. అలాగే పవన్ కెరియర్ లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఓజీ సినిమాని కూడా త్రివిక్రమ్ సెట్ చేశాడు. ఈ విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ మేనేజర్ లా మారిపోయాడు. అందుకే త్రివిక్రమ్ రిక్వెస్ట్ చేయగానే పవన్ కళ్యాణ్ వెంటనే ఒప్పుకున్నాడని టాక్. దీని గురించి అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ఇదే కనుక నిజమైతే అభిమానుల సంతోషానికి హద్దులు ఉండవు.