Pawan Kalyan : ఏంటి.. పవన్ కళ్యాణ్ హోస్ట్‌గా భారీ రియాలిటీ షోనా.. అలా ఎలా మిస్ అయింది..!
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు. ఆయన వెండితెరపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా కూడా ఆయన తన బాధ్యతలని నిర్వర్తిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ హోస్ట్‌గా ఓ షో రూపొందాల్సి ఉండగా, అది ఆగిపోయిందనే ఓ టాక్ ఇప్పుడు నడుస్తుంది. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ కూడా హోస్ట్ అవతారం ఎత్తబోయి కొంచెంలో మిస్ అయ్యాడట. అది కూడా భారీ రేటింగ్ ఉండే ఈటీవీలో .. రామోజీ రావు ఆద్వార్యంలో ఓ భారీ రియాల్టీ షోను ప్లాన్ చేశారట. ఈ షోను పవర్ చేతే చేయించాలని రామోజీరావ్ పట్టుబట్టార. అది ఏదో కాదు బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయ్యి.. జనాలలో భారీ స్పందన సాధించిన సత్యమేవ జయతే ప్రోగ్రామ్స్ ను తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేయించాలి అనుకున్నాడట రామోజీ.
సత్యమేవ జయతే కార్యక్రమానికి ఆమీర్ ఖాన్ హోస్టింగ్ చేశారు. ఆయన ఇలా సమాజానికి మంచి చేసేవాటిలో ముందు ఉంటాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అలానే సమాజసేవకు ముందు ఉంటారు కాబట్టి.. పవన్ చేత ఈ ప్రోగ్రామ్ చేయించాలి అని రామోజీరావు అన్ని రెడీ చేసుకున్నారట. ఈ ప్రోగ్రామ్ కోసం పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కాని కొన్ని కారణాల వల్ల ఇది డిలే అవూతు వచ్చింది. అంతే కాదు ఈలోపు పవన్ పార్టీ పెట్టడం.. రాజకీయంగా బిజీ అవ్వడంతో ఈకాన్సెస్ప్ట్ మరుగున పడిపోయింది. ఇక పవన్ తప్పించి ఈ ప్రోగ్రామ్ కు ఎవరూ బాగోరు అన్న ఆలోచనలో రామోజీరావు కూడా ఈప్రయత్నం విరమించారట.
ఇలా పవన్ కళ్యాణ్ హోస్టింగ్ చేయాల్సిన ఓప్రోగ్రామ్ ను ఫ్యాన్స్ మిస్ అయ్యారు. ఇక ఇప్పుడు ఆయన రాజకీయాలతో పాటు.. ప్రభుత్వంలో భాద్యాతాయుతమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. పిఠాపురం మహిళలకు డిప్యూట సీఎం పవన్ కళ్యాణ్ పంపించిన స్పెషల్ గిఫ్ట్‌లు పంపిణీ చేశారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తిపీఠం శ్రీ పురూహూతిక అమ్మవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించారు. వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులకు స్థానిక శాసనసభ్యులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతో పంపిన పసుపు, కుంకుమ, చీరలు అందజేశారు. పవన్ తరఫున ఆయన వదిన, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సతీమణి శ్రీమతి పద్మజ, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పంపిణీ చేశారు. వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ పసుపు, కుంకుమ, చీరలు కానుకగా అందజేశారు. కొణిదెల పద్మజ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, బొట్టు పెట్టి మరీ సారె అందించారు.