Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాపై అప్‌డేట్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
Pawan Kalyan : వకీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస బెట్టి సినిమాలు అనౌన్స్ చేశారు. పవన్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాని కరోనా మహమ్మారి ఆ సినిమాలని వెనక్కి నెడుతూ ఉంది. ఇప్పటికే పవన్ నటించిన భీమ్లా నాయక్ సంక్రాంతికి విడుదల కావలసి ఉండగా, ఫిబ్రవరికి వాయిదా పడింది. అప్పుడు కూడా రిలీజ్ కావడం కష్టమే అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’.
గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఈ సినిమా రానుండడంతో చిత్రంపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే హరిహర వీరమల్లు షూటింగ్ ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఆ తర్వాతే భవదీయుడు భగత్ సింగ్ మూవీ పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దేవిశ్రీ పవన్ మూవీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
Pawan Kalyan : గబ్బర్ సింగ్ కాంబోపై భారీ అంచనాలు
‘గబ్బర్ సింగ్’ తరువాత పవన్ – హరీశ్ శంకర్ తో కలిసి పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ కావడం వలన పవన్ అభిమానులంతా కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు. ఆ అంచనాలకి ఎంతమాత్రం తగ్గని అవుట్ పుట్ ఈ సారి మా దగ్గర నుంచి వెళ్లాలంటే ఇంతకుముందు కన్నా ఎక్కువగా మేము కష్టపడాలి. ఇప్పటికే నేను కొన్ని సాంగ్స్ చేశాను. చాలా ఎనర్జిటిక్ గా .. మెలోడియస్ గా ఈ ఆల్బమ్ ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది” అని చెప్పుకొచ్చాడు దేవి శ్రీ. భవదీయుడు భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.