Pawan Kalyan : 20 రోజుల్లో సినిమా కంప్లీట్ చేస్తారా.. అయ్యే పనేనా..?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అదెప్పుడు పూర్తవుతుందో చెప్పడం ఇప్పుడు చాలా కష్టం అని చెప్పక తప్పదు. ఎందుకంటే పవన్ అటు రాజకీయాలలోనూ బిజీగా ఉంటున్నారు. ఎలక్షన్స్ సమయం దగ్గరపడుతుంటంతో ఇకపై ఎక్కువ సమయం దానికే కేటాయించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకే, ప్రస్తుతం పవన్ కమిటైన సినిమాలను ఈ దసరా పండుగ లోపు కంప్లీట్ చేయాలని ఆయా చిత్ర దర్శకనిర్మాతలకు పవన్ చెప్పినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి.వచ్చే దసరా లోపు ఇప్పుడు నటిస్తున్న సినిమాలో తన పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేయబోతున్నారని పవన్ సన్నిహిత వర్గాలు చెబున్నారు.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే ఈ సినిమా 60 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పలు కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలో మళ్ళీ సెట్స్ మీదకు తీసుకువచ్చి వీలైనంత త్వరగానే కంప్లీట్ చేయాలని క్రిష్ బృందం షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ ‘వినోదయ సీతమ్’ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఒరిజినల్ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన సముద్రఖని దర్శకత్వంలోనే తెలుగు రీమేక్ కూడా తెరకెక్కినుంది. అయితే, తాజాగా ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ 20 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారట.
Pawan Kalyan : అందుకే, 20 రోజుల్లో పవన్ కళ్యాణ్ ‘వినోదయ సీతమ్’..?
ఈ సినిమాపై త్వరలోనే అనౌన్స్ రాబోతోంది. పవన్ ఈ సినిమాను 20 రోజుల్లోనే తన పార్ట్ పూర్తి చేయాలని దర్శకుడికి కండిషన్ పెట్టారట. అందుకే, ముందు పవన్ కళ్యాణ్ షూట్ కంప్లీట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ మేనల్లుడు, యంగ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నాడు. అయితే, ఇలాగే 25 రోజుల్లో కంప్లీట్ చేయాలనుకున్న భీమ్లా నాయక్ సినిమాను కొన్ని నెలలు చేయాల్సి వచ్చింది. అందుకే, 20 రోజుల్లో పవన్ కళ్యాణ్ ‘వినోదయ సీతమ్’ సినిమాని కంప్లీట్ చేస్తారంటే అయ్యే పనేనా అని కామెంట్స్ చేస్తున్నారు.