Hari Hara VeeraMallu Movie : అనుకున్నదే నిజమైంది.. ‘హరిహర వీరమల్లు’గా పవన్ కళ్యాణ్
Hari Hara VeeraMallu Movie : పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమాకు సంబంధించిన అప్డేట్ తాజాగా వచ్చింది. మహా శివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ గ్లింప్స్ రాబోతోందంటూ గత కొన్ని రోజుల నుంచి నానా హంగామా చేశారు. బాగానే ప్రమోట్ చేశారు. అయితే ఈ మూవీ టైటిల్ ఇదే నంటూ ఎన్నో రోజుల నుంచి కొన్ని లీకులు బయటకు వచ్చాయి. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ ఓ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.
పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ చిత్రంలో వజ్రాలు, మొఘలుల సామ్రాజ్యం నాటి సంగతులుండబోతోన్నాయి. వజ్రాల దొంగగా పవన్ కళ్యాణ్ నటించబోతోన్నట్టు అందరికీ తెలిసిందే. అయితే ఇంత వరకు ఫస్ట్ లుక్ టైటిల్ అధికారికంగా విడుదల చేయలేదు. కానీ వీరమల్లు అనే పాత్రలో పవన్ కళ్యాణ్ నటించబోతోన్నట్టు వార్తలు వచ్చాయి. లీకులు కూడా ఓ రేంజ్‌లో హల్చల్ చేశాయి.

Pawan kalyan PSPK 27 Title Hari Hara veeramallu Movi
Hari Hara VeeraMallu Movie : ‘హరిహర వీరమల్లు’గా పవన్ కళ్యాణ్
తాజాగా చిత్రయూనిట్ వదిలిన టైటిల్ పోస్టర్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ అద్బుతంగా కనిపించాడు. ప్యాన్ ఇండియా లెవెల్‌లో రాబోతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతోంది. జూలైలో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుండగా.. విజువల్ ఎఫెక్ట్స్ కోసం దాదాపు ఆరు నెలలకు పైగా కేటాయించబోతోన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి టైటిల్ పోస్టర్‌తో అంచనాలు అమాంతం పెంచేశారు.
