Rajendra Prasad : మొన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్.. పుష్ప 2 కామెంట్స్ ఎంతవరకు సమర్ధనీయం..?
ప్రధానాంశాలు:
Rajendra Prasad : మొన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్.. పుష్ప 2 కామెంట్స్ ఎంతవరకు సమర్ధనీయం..?
Rajendra Prasad : ఒక సినిమా హిట్ పడింది అంటే దాని గురించి మాట్లాడుకునే వాళ్లు చాలామంది ఉంటారు. ఇక పాన్ ఇండియా లెవెల్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసే సినిమాల గురించి అన్నిచోట్ల చర్చ జరుగుతుంది. ప్రస్తుతం నేషనల్ లెవెల్ లో ఎక్కడ చూసినా సరే పుష్ప రాజ్ మేనియా గురించి మాట్లాడుకుంటున్నారు. నార్త్ సైడ్ అయితే ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. సినిమా అన్నిచోట్ల ప్రభంజనం సృష్టిస్తుంటే దాన్ని చూసి ఒక కామెంట్ చేస్తే పోలా అని అందరు అనుకుంటారు. అలాంటి ఒక కామెంట్ చేసి నిప్పు రాజేశారు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. ఆయన నటించిన హరికథ వెబ్ సీరీస్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వాడెవడో చందనం దొంగ వాడి సినిమా చూస్తారు అంటూ చెప్పాడు. వెంటనే సర్ధుకుని తను కూడా కెరీర్ లో చాలా రకాల పాత్రలు చేశానని అన్నారు. వాడెవడో చందనం దొంగ అన్న మాట పట్టుకుని రాజేంద్ర ప్రసాద్ ని ట్రోల్ చేస్తున్నారు అల్లు ఫ్యాన్స్.
Rajendra Prasad సినిమా హిట్ అయిన ఊపు మీద ఉన్న అల్లు ఫ్యాన్స్..
అసలే సినిమా హిట్ అయిన ఊపు మీద ఉన్న అల్లు ఫ్యాన్స్ కి మంచి స్టఫ్ అయ్యాడు రాజేంద్ర ప్రసాద్. ఐతే పుష్ప 1 రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యాక పవన్ కూడా సినిమా హీరోలు స్మగ్లర్లుగా చేస్తున్నారని అన్నాడు. ఐతే ఆ కామెంట్ కూడా అల్లు అర్జున్ సినిమా మీదే అనుకుని అప్పట్లో నానా హడావిడి చేశారు. ఐతే వారు ఏం చేసినా ఎంత చేసినా అలా మాట్లాడగలిగేలా నటించాడు కాబట్టే.. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ జస్టిఫై చేశాడు కాబట్టే ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయని చెప్పొచ్చు.
పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ ది బెస్ట్ ఇచ్చాడు. అందుకే అతని పాత్ర అంతగా జనాల్లోకి వెళ్లింది. హీరో చేశాడు కాబట్టి అందరు అలా ఫాలో అవుతారని కాదు కానీ సినిమాలో తెర మీద వరకే అభినయం కోసం చేసిన పాత్ర గురించి ప్రస్తావించిన వారు కాస్త క్లారిటీ ఇస్తే బాగుండేది. పుష్ప రాజ్ క్యారెక్టరైజేషన్ లో అల్లు అర్జున్ ని ఎవరైనా మాట అనాల్సి వస్తే మాత్రం అల్లు ఫ్యాన్స్ మాత్రం ఊరుకునే పరిస్థితి కనిపించట్లేదు. Pawan Kalyan Rajendra Prasad Comments on Pushpa Character , Pawan kaLyan, Rajendra Prasad, Pushpa 2, Harikatha, Tollywood