Pawan Kalyan : అదిరిపోయిన వీడియో.. సెట్‌లోకి పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ
Pawan Kalyan Rana ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్ షూటింగ్‌ను మొదలెట్టిన సంగతి తెలిసిందే. నిన్న హైద్రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్‌ను ప్రారంభించారు. మొదటి రోజే యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రీమేక్‌కు సంబంధించిన వరుస ప్రకటనలు అంచనాలు పెంచేస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్, త్రివిక్రమ్ స్క్రిప్ట్ రైటర్‌గా ఈ సినిమాకు పని చేస్తున్నాడని చెబుతూ వదిలిన వీడియోలు ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి.

Pawan Kalyan Rana Production No 12 Shoot Begins
Pawan Kalyan Rana : రానా, పవన్ కళ్యాణ్ పాత్రలు ఢీ అంటే ఢీ
ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ తనదైన శైలిలో మార్పులు చేర్పులు మాటలు అన్నీ కూడా మార్చేశాడు. ఇక సాగర్ కే చంద్ర కేవలం దాన్నితెరపైకి తెచ్చే బాధ్యతను తీసుకున్నాడు. ఈ సినిమాలో రానా, పవన్ కళ్యాణ్ పాత్రలు ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ఉంటాయి. ఆర్మీ, పోలీసాఫీసర్‌కు మధ్య జరిగే కోల్డ్ వార్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మొత్తానికి ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. వీలైనంత త్వరగా ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేయనున్నారు.
ఈ మేరకు నిన్న జరిగిన షూటింగ్ నుంచి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, నిర్మాతలు, దర్శకుడు కలిసి మాట్లాడుకుంటున్నారు. అలా త్రివిక్రమ్, పవన్ కళ్యాన్ నడిచి వస్తుంటే ఆ సీన్ అదిరిపోయింది. ఇక మొదటి సీన్‌లో భాగంగా పవన్ కళ్యాణ్ బుల్లెట్‌పై ఎంట్రీ ఇచ్చే సీన్‌ను తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది వేసవిలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నట్టు ప్రకటించారు. మొత్తానికి ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్‌లా ఉంది.
