Pawan Kalyan : సుమ వయసుపై పవన్ కళ్యాణ్ పంచ్‌లు.. నవ్వుకున్న యాంకర్
Pawan Kalyan : యాంకర్ సుమ వయసు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటుంది. బుల్లితెరపై సుమ ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అయి ఉంటాయి. అయితే సుమ మొదట్లో వెండితెరపైనా కనిపించింది. కొన్ని సినిమాల్లో సైడ్ కారెక్టర్ వేసింది. ఇంకొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. అయితే సుమ మాత్రం ఎక్కువగా బుల్లితెర ద్వారానే ఫేమస్ అయింది.బుల్లితెరపై యాంకర్, హెస్ట్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ తెచ్చుకుంది. సుమలో ఓ నటి ఉన్నా కూడా ఎక్కువగా బయటకు రాలేదు. అవకాశం లభించలేదు.
అయితే తాజాగా సుమ తనలోని ఇంకో యాంగిల్‌ను చూపించబోతోంది. ఈ క్రమంలోనే జయమ్మ పంచాయితీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయించారు.నిన్న పవన్ కళ్యాణ్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. సుమకి ఎంతో మంది అభిమానులున్నారు.. అందులో నేను కూడా ఒకరిని. ఆమె దాదాపు దశాబ్దం.. పన్నెండేళ్లు క్రితం హీరోయిన్‌గా నటించిందంటూ పవన్ కళ్యాణ్ ఏదో చెప్పబోతాడు.

Pawan Kalyan Suma Fuuny Conversation At Jayamma Panchayathi Trailer Event
అంత కరెక్ట్‌గా ఎందుకులేండి మళ్లీ వయసు తెలిసిపోతుంది అని సుమ కౌంటర్ వేస్తుంది.దీంతో పవన్ కళ్యాణ్ నవ్వేస్తాడు. మొత్తానికి సుమ నటన, అంకిత భావానికి పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యాడు. తన సినిమాలో చేయమని అడిగాడు. మీరు నటిస్తాను అంటే మా నిర్మాతలకు చెప్పి.. మీకు ఎలాంటి పాత్ర కావాలో అలాంటి పాత్రే ఇప్పిస్తాను అని అందరి ముందే మాటిచ్చేశాడు పవన్ కళ్యాణ్. మొత్తానికి సుమకు మాత్రం బంపర్ ఆఫర్ వచ్చేసినట్టు అయింది.
