Pawan kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌గ్గ‌ర ప‌ని చేసే అత‌ను భార్య మంగ‌ళ‌సూత్రం అమ్మాడా.. తర్వాత ఏమైందంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :3 May 2024,4:00 pm

Pawan kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు న‌టుడు మాత్ర‌మే కాదు రాజ‌కీయ నాయ‌కుడు కూడా. జ‌న‌సేన అధినేత‌గా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారాల‌తో చాలా బిజీగా ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్‌కు అవకాశం ఇచ్చారని.. ఈ సారి ప్రజలు వారి భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి ఒక్క ఛాన్స్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ ప్రజల్ని మోసం చేశారని.. ఆయన నుంచి ప్రజల్ని కాపాడేందుకు వచ్చార‌ని ప‌వన్ క‌ళ్యాణ్ అన్నారు. అయితే ప‌వ‌న్‌ని గెలిపించేందుకు ఆయ‌న అభిమానులు, స‌న్నిహితులు ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో శ‌ర‌త్ మ‌రార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Pawan kalyan : ప‌వ‌న్ భ‌యం చూపించాడు..

సర్దార్ గబ్బర్ సింగ్, గోపాల గోపాల, కాటమరాయుడు లాంటి చిత్రాలని శరత్ మరార్ పవన్ తో నిర్మించారు. ఆయ‌న చాలా స‌న్నిహితంగా ఉంటారు. తాజాగా ప‌వ‌న్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పవన్ నిర్మాతలని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. అవసరం అయితే తానే నష్టపోతాడు తప్ప.. నిర్మాతలకు నష్టం కలిగించడు. డబ్బు విషయంలో ముందు వెనక ఆలోచించమని.. పిల్లలున్నారు జాగ్రత్తగా ఉండమని నేను, త్రివిక్రమ్ ఓ సారి సలహా ఇచ్చి తిట్లు తిన్న విషయాన్ని కూడా శరత్ మరార్ గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కి డబ్బు పై ఆశ లేదు. నేను, త్రివిక్రమ్ చాలాసార్లు చెప్పి చూశాం. ఆయన వినలేదు. మాకు క్లాస్ పీకారు. నా పిల్ల‌ల‌ లైఫ్ ని లీడ్ చేయడానికి అవసరమైన స్ట్రెంత్ ఇస్తాను అని పవన్ అన్నారట.

Pawan kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌గ్గ‌ర ప‌ని చేసే అత‌ను భార్య మంగ‌ళ‌సూత్రం అమ్మాడా.. తర్వాత ఏమైందంటే..!

Pawan kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌గ్గ‌ర ప‌ని చేసే అత‌ను భార్య మంగ‌ళ‌సూత్రం అమ్మాడా.. తర్వాత ఏమైందంటే..!

పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేసే వ్యక్తి తన భార్య మంగళ సూత్రం అమ్మేసి మరీ పేకాట ఆడాడు. దీనితో అతడి భార్య పవన్ వద్దకు వచ్చి బోరున ఏడ్చేసింది. దీనితో పవన్ ఆమెకి ధైర్యం చెప్పి ఆర్థికంగా సాయం చేశారు. అంతటితో ఆగలేదు. ఆమె భర్తని పిలిపించి గ‌ట్టిగా క్లాస్ పీకాడు. ఆ రోజు వాడికి పవన్ భయం రుచి చూపించారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ తో అతడు మళ్ళీ పేకాట జోలికి వెళ్ళలేదు. తన పద్ధతి మార్చుకున్నాడు అని శరత్ మరార్.. ప‌వన్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి