Vakeel saab 1 Day collections : వకీల్ సాబ్ జోరు.. మొదటి రోజు ఎంత రాబట్టాడంటే
Vakeel saab 1 Day collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా సృష్టింస్తోన్న ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూసినా బ్లాక్ బస్టర్ రిపోర్టులే కనిపిస్తున్నాయి. సాధారణ ప్రేక్షకుల నుంచి టాప్ సెలెబ్రిటీల వరకు అందరూ కూడా వకీల్ సాబ్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక దర్శక నిర్మాతలు అయితే మీడియాతో మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు. ఇన్నేళ్లలో ఎన్నో విజయాలు చూశాను కానీ ఇది కొత్త అనుభూతిని ఇస్తోందంటూ దిల్ రాజు ఎమోషనల్ అయ్యాడు.
అంతలా వకీల్ సాబ్ గురించి దిల్ రాజు మాట్లాడేశాడు. ఇక నిన్ననే కలెక్షన్ల గురించి కూడా కొంత హింట్ ఇచ్చాడు. ఇప్పటికే కలెక్షన్లు ఓ రేంజ్‌ను దాటాయని టాక్ వస్తోంది.. కానీ ఇప్పుడిప్పుడు ఈ సినిమా రేంజ్ ఏంటి అనేది చెప్పలేను. అది మిగతా రోజుల్లో రాబట్టే కలెక్షన్లు చెబుతాయని దిల్ రాజు అన్నాడు. అయితే ఇప్పుడు అందరూ కూడా వకీల్ సాబ్ మొదటి రోజు రికార్డుల గురించి గుసగుసలాడుకుంటున్నారు.
Vakeel saab 1 Day collections : వకీల్ సాబ్ జోరు.. మొదటి రోజు ఎంత రాబట్టాడంటే?
వకీల్ సాబ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్‌పై కన్నేశాడు. కరోనా ఉన్నా కూడా థియేటర్లన్నీ దద్దరిల్లిపోయాయ్. ఓవర్సీస్‌లోనూ వకీల్ సాబ్ సత్తా చాటాడు. అలా మొత్తంగా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 26 నుంచి 28 కోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తున్నాడు. అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 32 కోట్లు రాబట్టే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇవి ఓ అంచనా మాత్రంగానే చెప్పుకుంటున్నారు. మరి దిల్ రాజు అధికారికంగా కలెక్షన్లను ఎప్పుడు ప్రకటిస్తాడో చూడాలి.