Payal Rajput : అక్కడ కాదు ఇక్కడ ఆ పని చేయండన్న పాయల్.. RX 100 బ్యూటీ హల్చల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Payal Rajput : అక్కడ కాదు ఇక్కడ ఆ పని చేయండన్న పాయల్.. RX 100 బ్యూటీ హల్చల్

Payal Rajput : తొలి సినిమాతో ఫేమస్ అయి నిలదొక్కుకుంటున్న హీరోయిన్స్ కొందరే ఉంటారు. అందులో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. Rx100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అలా వచ్చి రాగానే తన అందాలతో యూత్ ఆడియన్స్‌కి గాలం వేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులు మెచ్చిన హాట్ బ్యూటీగా వరుస ఆఫర్స్ చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఐటెం సాంగ్ చేయడంలోనూ తనది ప్రత్యేకమైన శైలి అని నిరూపించుకున్న పాయల్.. అటు సోషల్ మీడియాలో కూడా హవా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :1 November 2021,8:40 pm

Payal Rajput : తొలి సినిమాతో ఫేమస్ అయి నిలదొక్కుకుంటున్న హీరోయిన్స్ కొందరే ఉంటారు. అందులో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. Rx100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అలా వచ్చి రాగానే తన అందాలతో యూత్ ఆడియన్స్‌కి గాలం వేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులు మెచ్చిన హాట్ బ్యూటీగా వరుస ఆఫర్స్ చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఐటెం సాంగ్ చేయడంలోనూ తనది ప్రత్యేకమైన శైలి అని నిరూపించుకున్న పాయల్.. అటు సోషల్ మీడియాలో కూడా హవా నడిపిస్తోంది.

payal rajput shared a interesting post on her social media

payal rajput shared a interesting post on her social media

ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అమాంతం ఫాలోయింగ్ పెంచుకుంటోంది. రెగ్యులర్ సినిమా అప్‌డేట్స్ ఇస్తూ నెటిజన్ల దృష్టి తన సోషల్ మీడియా ఖాతాలపై పడేలా చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా పాయల్ షేర్ చేసిన ఓ పిక్ పలువురిని ఆలోచనలో పడేసింది. ఈ సారి హాట్ విషయాలను పక్కనబెట్టి సమాజంలో రెగ్యులర్‌గా జరుగుతున్న ఓ తంతంగం గురించి పోస్ట్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

Payal Rajput : అక్కడ కాదు.. ఇక్కడ

payal rajput shared a interesting post on her social media

payal rajput shared a interesting post on her social media

సాధారణంగా ఎవ్వరైనా సరే కూరగాయల బండి దగ్గరో, ఫుట్‌పాత్ మార్కెట్‌లో వస్తువులు కోనేట్టప్పుడో బేరమాడుతారు తప్ప.. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్ట్స్ వెళ్ళినప్పుడు మాత్రం ఎంత కాస్లీ అయినా సరే అక్కడ పేర్కొన్నంత సొమ్ము చెల్లిస్తుంటారు. ఇదే విషయాన్ని ఫోకస్ చేసిన పాయల్.. ఫుట్‌పాత్ మార్కెట్‌లో కాదు బేరమాడేది, పెద్ద షాపింగ్ మాల్స్‌లో బేరమాడండి అని పేర్కొంది. దీంతో ఈ పోస్ట్ చేసిన నెటిజన్లు సూపర్ అంటూ కితాబిస్తున్నారు. కాగా, ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉంది పాయల్ రాజ్‌పుత్.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది