Pedarayudu Child Artist : ‘నేను చూశాను తాతయ్య’ అప్పటి చిన్నోడు ఇప్పుడు హీరో.. అసలు గుర్తుపట్టలేరు!
ప్రధానాంశాలు:
Pedarayudu Child Artist : ‘నేను చూశాను తాతయ్య’ అప్పటి చిన్నోడు ఇప్పుడు హీరో.. అసలు గుర్తుపట్టలేరు!
Pedarayudu Child Artist : తెలుగు సినీ పరిశ్రమ Tollywood లో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు Child Artists గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎంతో మంది ఇప్పుడు హీరోలు, హీరోయిన్లుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తున్నారు. ఇటీవల తేజ సజ్జా Teja Sajja , కావ్య కళ్యాణ్ రామ్ Kavya Kalyanram వంటి బాలనటీనటులు హీరో, హీరోయిన్‌లుగా సక్సెస్ సాధించగా.. ఇప్పుడు మరో చైల్డ్ ఆర్టిస్టు తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా రాబోతున్నాడు. అతడే మాస్టర్ మహేంద్రన్ Master Mahendran .తెలుగు ప్రేక్షకులు ఆయనను పేరు కంటే ‘పెదరాయుడు’ Pedarayudu సినిమాలోని చిన్నోడిగానే ఎక్కువగా గుర్తుంచుకున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ Rajinikanth నటించిన ఆ చిత్రంలో “నేను చూశాను తాతయ్య” అంటూ చెప్పిన ఒక్క డైలాగ్‌తో ఆయన ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇప్పుడు అదే చిన్నోడు పూర్తిగా మారిపోయి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు.

Pedarayudu Child Artist : ‘నేను చూశాను తాతయ్య’ అప్పటి చిన్నోడు ఇప్పుడు హీరో.. అసలు గుర్తుపట్టలేరు!
Pedarayudu Child Artist ‘పెదరాయుడు’ Pedarayud) సినిమాలో చిన్నోడిగా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ మహేంద్రన్ Master Mahendran
మహేంద్రన్ Mahendran 1994లో తమిళ చిత్ర పరిశ్రమ Kollywood లో బాలనటుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడు. చిన్న వయసులోనే సహజమైన నటనతో దర్శకుల దృష్టిని ఆకర్షించిన ఆయన వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లోనూ ఆయన అనేక చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగులో పెదరాయుడు Pedarayudu , దేవి Devi , ఆహా Aaha, పెళ్లి చేసుకుందాం Pelli Chesukundam, నీ స్నేహం Nee Sneham , అమ్మాయి కోసం Ammayi Kosam , లిటిల్ హార్ట్స్ Little Hearts వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా మోహన్ బాబు Mohan Babu , రజినీకాంత్ Rajinikanth వంటి స్టార్ హీరోలతో కలిసి నటించడం ఆయన కెరీర్‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. చిన్న వయసులోనే తన సహజమైన నటనతో కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కలిపి 130కు పైగా సినిమాల్లో 130+ Movies బాలనటుడిగా నటించడం మహేంద్రన్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
Pedarayudu Child Artist చైల్డ్ ఆర్టిస్టు Child Artist నుంచి హీరో Hero వరకు.. మహేంద్రన్ Mahendran సినీ ప్రయాణం
కొంతకాలం చదువుల కోసం సినిమాలకు విరామం ఇచ్చిన మహేంద్రన్ Mahendran, ఆ తర్వాత హీరోగా తిరిగి సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో Kollywood హీరోగా వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. నీలకంఠ Neelakantha సినిమాతో హీరోగా తెలుగు తెరపై కనిపించిన ఆయన.. తాజాగా వసుదేవసుతం Vasudeva Sutam సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ Teaser, సాంగ్స్ Songs ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నాయి. మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవాలని మహేంద్రన్ ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన లేటెస్ట్ ఫోటోలు Latest Photos చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు అమాయకమైన చిన్నోడిగా కనిపించిన మహేంద్రన్.. ఇప్పుడు స్టైలిష్ హీరోగా పూర్తిగా మారిపోయాడని కామెంట్లు చేస్తున్నారు. బాలనటుడిగా ఎన్నో మధురమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించిన మాస్టర్ మహేంద్రన్ Master Mahendran, ఇప్పుడు హీరోగా కూడా అదే స్థాయి విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. వసుదేవసుతం Vasudeva Sutam సినిమా ఆయన తెలుగు కెరీర్‌కు మరో మంచి ఆరంభం అవుతుందా లేదా అనేది చూడాలి.







