Singer Mangli : జగన్ ప్రభుత్వం సలహాదారుడిగా తనని నియమించాక.. సొంత ఊరిలో సింగర్ మంగ్లీ చేసిన పనికి దండాలు పెడుతున్న జనాలు..!!
Singer Mangli : సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్ వీడియోస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంది. ఇదే సమయంలో ప్రవేట్ పాటలు కూడా పాడుతూ బతుకమ్మ, బోనాలకు సంబంధించిన పాటలు.. పాడి మంచి క్రేజ్ సంపాదించింది. ముఖ్యంగా శేఖర్ కమల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన “లవ్ స్టోరీ” సినిమాలో “సారంగదరియా” సాంగ్ తో విపరీతమైన పాపులారిటీ అందుకుంది. ఇండస్ట్రీలో అన్ని రకాలుగా స్థిరపడిన సింగర్ మంగ్లీ… తన చెల్లిని కూడా పరిచయం చేయడం జరిగింది.
ఆమె “పుష్ప” సినిమాలో ఐటెం సాంగ్..‘ఉ అంటావా మామ’ పాట పాడింది. ఈ పాటతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంది. సింగర్ మంగ్లీ ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) ఛానెల్ సలహాదారుగా ఆమెను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం పదవీ బాధ్యతలు కూడా మంగ్లీ చేపట్టడం జరిగింది. గతంలో వైసీపీ అధినేత జగన్ కి సంబంధించి మంగ్లీ పాడిన “రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న” అనే సాంగ్ ఎంతో పాపులర్ అయింది. వైసీపీ కార్యకర్తలకు మంచి బూస్ట్ ఇచ్చే సాంగ్. ఈ క్రమంలో ఆమెకు టీటీడీ ప్రభుత్వ సలహాదారు బాధ్యత అప్పజెప్పటంతో… ఆమెకు లక్ష రూపాయలు జీతం ప్రభుత్వం నుండి అందుతూ ఉంది.
ఇలాంటి తరుణంలో కెరియర్ పరంగా అన్ని రకాలుగా మంచి రోజులు రావటంతో సింగర్ మంగ్లీ సొంతూరులో ఒక మంచి పని చేయడం జరిగింది. మంగ్లీ స్వస్థలం అనంతపురంకి గుత్తి దగ్గర బసినేపల్లి. అక్కడ ఆమె తండాకు చెందిన వ్యక్తి. ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారుడిగా పదవి చేపట్టాక ఇటీవలే ఆమె తన సొంత ఊరులో తన సొంత ఖర్చులతో ఆంజనేయ స్వామి గుడిని నిర్మించిందట. సింగర్ మంగ్లీ ఊరిలో ఈ గుడి చాలా ఫేమస్. శ్రీరామనవమి ఇంకా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఈ గుడిలో భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఈ క్రమంలో మంగ్లీ ఆ గుడికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భారీ ఎత్తున డబ్బులు ఇవ్వడం జరిగిందంట. సింగర్ మంగ్లీ.. చేసిన పనికి సొంత ఊరు వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ దండాలు పెడుతున్నారు.