PM Modi : ప్రధాని మోదీపై దాడికి పీఎఫ్ఐ కుట్ర.. ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు బహిర్గతం
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీపై దాడికి పీఎఫ్ఐ కుట్ర చేసిందా? పీఎఫ్ఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. మోదీపై దాడి చేయడానికి పీఎఫ్ఐ కుట్ర చేసిందంటూ వస్తున్న వార్తలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. బీహార్ లోని పాట్నాలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆయనపై దాడి చేయాలని పీఎఫ్ఐ కుట్ర పన్నిందట. గత జులై 12న ప్రధాని బీహార్ లో పర్యటించారు. అప్పుడే ప్రధానిపై దాడి చేయడానికి పీఎఫ్ఐ పక్కాగా ప్లాన్ చేసిందని ఎన్ఐఏ విచారణలో తాజాగా వెల్లడైంది.
ప్రధాని మోదీపై దాడి చేయడానికి కొందరికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చారట. ఎన్ఐఏ విచారణలో ఈ సంచలన విషయాలు బహిర్గతం అయినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీపై దాడి చేసేందుకు నిధులను సమీకరించారని.. దాదాపు రూ.120 కోట్లను పీఎఫ్ఐ బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారని తెలుస్తోంది. ప్రధాని మోదీతో పాటు పలువురు యూపీకి చెందిన రాజకీయ నేతలపై దాడి చేసేందుకు పీఎఫ్ఐ కుట్ర చేసినట్టు తెలుస్తోంది.
PM Modi : ఎన్ఐఏ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడి
ఎన్ఐఏ అధికారులు గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని మోదీపై దాడి చేసేందుకు కుట్ర జరిగిన విషయం తెలిసింది. ఇప్పటికే 105 మందిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అందులో కేరళ రాష్ట్రానికి చెందిన వాళ్లే 22 మంది ఉన్నారు. వారందరిపై పోలీసులు దేశద్రోహం కేసు పెట్టారు. వీరందరికీ శిక్షణ ఇచ్చి ప్రధాని మోదీపై కుట్ర చేసేందుకు పీఎఫ్ఐ కుట్ర పన్నినట్టు ఎన్ఐఏ అధికారుల విచారణలో తేలింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.