Bigg Boss 7 : బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కి షో కి జనాలలో ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో కి చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ షో ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ షో ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఏడవ సీజన్ మొదలుపెట్టనుంది. మొదటి షో కి ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండవ సీజన్ కి నాని హోస్ట్ చేశారు. ఆ తర్వాత నాలుగు సీజన్స్ కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించారు. అయితే త్వరలోనే బిగ్ బాస్ 7వ సీజన్ మొదలుకానుంది. దీనికి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు.
ఎంతో పాపులర్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో ఎన్నో విమర్శలను అందుకుంది. ఇప్పటికే చాలామంది దీనిపై విమర్శలు కురిపించారు. షో ను కూడా ఆపివేయాలని కొందరు కోర్టును ఆశ్రయించారు. తాజాగా సీజన్ సెవెన్ కి ప్రారంభానికి ముందే సవాళ్లు ఎదురవుతున్నాయి. వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా బిగ్బాస్ నిర్వహకులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ ను జాగ్రత్త వహించాలని, పోలీసులు షో నిర్వాహకులకు తెలిపారు. గత అనుభవాల ప్రకారంగా కాంట్రవర్సీ కంటెస్టెంట్లు మధ్య అప్రమత్తం వహించాలని అన్నారు.
బిగ్ బాస్ సెలక్షన్స్ సమయంలో కాస్టింగ్ కౌచ్ అంశాలు తెరపైకి రావడంతో అలాంటి వాటికి తావు లేకుండా ముందస్తు జాగ్రత్త పాటించాలని నిర్వాహకులకు సూచనలు జారీ చేశారు పోలీసులు. షో లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బయట చేసే హడావుడి విషయంలో పూర్తి బాధ్యత వహించాలని బయట సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తప్పవని పోలీసులు నిర్వహకులకు తెలిపారు. మొత్తానికి బిగ్ బాస్ షో మొదలవ్వకముందే పెద్ద సమస్యను ఎదుర్కొంది.
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
This website uses cookies.