Bigg Boss 7 : బిగ్ బాస్ నిర్వాహకులకు పోలీసుల వార్నింగ్ .. షో మొదలవ్వకముందే నిలిపివేత .. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 7 : బిగ్ బాస్ నిర్వాహకులకు పోలీసుల వార్నింగ్ .. షో మొదలవ్వకముందే నిలిపివేత ..

Bigg Boss 7 : బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కి షో కి జనాలలో ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో కి చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ షో ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ షో ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఏడవ సీజన్ మొదలుపెట్టనుంది. మొదటి షో కి ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండవ సీజన్ కి నాని హోస్ట్ చేశారు. ఆ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :11 August 2023,10:06 pm

Bigg Boss 7 : బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కి షో కి జనాలలో ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో కి చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ షో ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ షో ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఏడవ సీజన్ మొదలుపెట్టనుంది. మొదటి షో కి ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండవ సీజన్ కి నాని హోస్ట్ చేశారు. ఆ తర్వాత నాలుగు సీజన్స్ కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించారు. అయితే త్వరలోనే బిగ్ బాస్ 7వ సీజన్ మొదలుకానుంది. దీనికి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు.

police warning to bigg boss season 7

ఎంతో పాపులర్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో ఎన్నో విమర్శలను అందుకుంది. ఇప్పటికే చాలామంది దీనిపై విమర్శలు కురిపించారు. షో ను కూడా ఆపివేయాలని కొందరు కోర్టును ఆశ్రయించారు. తాజాగా సీజన్ సెవెన్ కి ప్రారంభానికి ముందే సవాళ్లు ఎదురవుతున్నాయి. వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా బిగ్బాస్ నిర్వహకులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ ను జాగ్రత్త వహించాలని, పోలీసులు షో నిర్వాహకులకు తెలిపారు. గత అనుభవాల ప్రకారంగా కాంట్రవర్సీ కంటెస్టెంట్లు మధ్య అప్రమత్తం వహించాలని అన్నారు.

బిగ్ బాస్ సెలక్షన్స్ సమయంలో కాస్టింగ్ కౌచ్ అంశాలు తెరపైకి రావడంతో అలాంటి వాటికి తావు లేకుండా ముందస్తు జాగ్రత్త పాటించాలని నిర్వాహకులకు సూచనలు జారీ చేశారు పోలీసులు. షో లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బయట చేసే హడావుడి విషయంలో పూర్తి బాధ్యత వహించాలని బయట సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తప్పవని పోలీసులు నిర్వహకులకు తెలిపారు. మొత్తానికి బిగ్ బాస్ షో మొదలవ్వకముందే పెద్ద సమస్యను ఎదుర్కొంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది