Sreeleela : పూజ హెగ్డే , సమంత వీళ్ళంతా శ్రీలీల పేరు చెప్తే కుళ్ళి సచ్చిపోతున్నారు .. కారణం ఇదే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreeleela : పూజ హెగ్డే , సమంత వీళ్ళంతా శ్రీలీల పేరు చెప్తే కుళ్ళి సచ్చిపోతున్నారు .. కారణం ఇదే !

 Authored By prabhas | The Telugu News | Updated on :1 March 2023,7:20 pm

Sreeleela : ‘ పెళ్లి సందడి ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల తన అందచందాలతో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. దీంతో మాస్ మహారాజా రవితేజ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇటీవల విడుదలైన ‘ ధమాకా ‘ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆమె ఎనర్జీ లెవెల్స్ ప్రేక్షకులను కట్టిపడేసాయి. నటన పరంగా, డాన్స్ పరంగా మంచి మార్క్ లు సంపాదించుకుంది. దీంతో ఆమెకు టాలీవుడ్లో వరుస సినీ ఆఫర్లు వస్తున్నాయి.

Pooja Hegde and Samantha get sick when they mention Sreeleela name

Pooja Hegde and Samantha get sick when they mention Sreeleela name

ఏకంగా 8 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ బ్యూటీ. దీంతో ఒకేసారి ఎనిమిది సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. స్టార్ హీరోయిన్లకు కూడా సాధ్యం కాని రీతిలో ఈమె వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుంటుంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించేందుకు ఛాన్స్ కొట్టేసింది. దాని తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్గా ఫిక్స్ అయిందట. అలాగే నటసింహం బాలయ్య మరియు అనిల్ రావిపూడి డైరెక్షన్లో రాబోతున్న

Sreeleela Upcoming Projects more than Samantha Pooja Hegde And Rashmika |  ఇదేం లైనప్‌రా బాబూ.. శ్రీలీల స్పీడుకు సమంత సైడ్?.. పూజా హెగ్డే క్లోజ్? News  in Telugu

సినిమాలో శ్రీ లీల ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించబోతుందని సమాచారం. ఈ సినిమాలే కాకుండా నితిన్ సినిమాలో, నవీన్ పోలిశెట్టి సినిమాలో, మరియు వైష్ణవ్ తేజ్ సినిమాలో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ల కంటే శ్రీ లీల ఫుల్ క్రేజ్ లో ఉంది. కెరీర్ ఆరంభంలో పూజ హెగ్డే, రష్మిక మందన కూడా ఇలాగే వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగారు ప్రస్తుతం శ్రీ లీలా కూడా వరుస సినిమాలు చేస్తూ త్వరలోనే స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి