Pooja Hegde : అదే లేకపోతే హీరోయిన్‌గా ఎదగడం చాలా కష్టం.. పూజాహెగ్డే సంచలన కామెంట్స్
Pooja Hegde : తెలుగు,తమిళ,మాళయాళం, కన్నడ ఇలా ఇండస్ట్రీలోనైనా మంచి హీరోయిన్‌గా గుర్తింపు పొందాలన్నా.. కొంతకాలం పాటు హీరోయిన్‌గా మంచి స్థానంలో కొనసాగాలన్నా ఆ క్వాలిటీ ఖచ్చితంగా ఉండాలని అంటోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే.. చాలా మంది సినిమాల్లో అవకాశాల కోసం వస్తారు. చాన్స్ వచ్చాక హీరోయిన్ అయ్యామా లేదా అని మాత్రమే చూసుకుంటారు.హీరోయిన్ అవ్వడం ఇక్కడ ముఖ్యం కాదు. ఉన్నత స్థానాలకు చేరుకోవడం ముఖ్యం. కొంత కాలం వరకు మన పేరు వినిపించాలని అంటోంది ఈ కన్నడ ముద్దుగుమ్మ పూజా.. పూజా హెగ్డే ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అయ్యింది.
కానీ ఇప్పటివరకు తను ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ ఎవరిమీద చేయలేదు. ఇండస్ట్రీ మీ ద కూడా చేయలేదు. తన పని ఎంటో తాను చేసుకుంటూ వెళ్లింది. సినిమా హిట్టా ఫట్టా అనే సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే, మొన్నటివరకు వరుసగా హిట్ అయిన ఈ అమ్మడి సినిమాలు ప్రస్తుతం మళ్లీ ఫెయిల్ అవుతున్నాయి. కెరీర్ మొదట్లో ఎలాంటి ఇబ్బందులు పడిందో పూజా.. ఇప్పుడు కూడా అలాంటి విపత్కర పరిస్థితులను ఫేస్ చేస్తోంది. అయితే, ఇన్నాళ్లు మౌనంగా ఉన్న పూజ ఒక్కసారిగా నోరు తెరిచి పలు కామెంట్స్ చేసింది. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కెరీర్ మళ్లీ నెగెటివ్ దశలోకి వెళ్తున్న క్రమంలో పూజ.. ఇండస్ట్రీపై కామెంట్స్ చేయడం ఎంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయం తను సక్సెస్ లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని అడిగేవాళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో 3 సినిమాలు,టాలీవుడ్‌లో ఒక సినిమా, కోలీవుడ్‌లో ఒక సినిమా చేస్తోంది పూజ..రీసెంట్ ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో పూజ మట్లాడుతూ.. హీరోయిన్ అవ్వాలనుకునే వారికి అదృష్టం బాగుండాలి.టైం కలిసి రావాలి.లక్కు కూడా ఉండాలి. దీనికి తోడు కష్టపడే తత్వం కూడా ఉండాలి. వీటన్నింటిలోకెళ్లా ఓపిక చాలా అవసరం. అదే లేకపోతే సినిమా పరిశ్రమలో ఎక్కువ కాలం నెగ్గుక రాలేరని వివరించింది.