Pooja Hegde : వైట్ డ్రెస్‌లో మైమ‌ర‌చిపోయేలా చేస్తున్న పూజా హెగ్డే.. ఆ అందాల‌కు ఫిదా అవ్వాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pooja Hegde : వైట్ డ్రెస్‌లో మైమ‌ర‌చిపోయేలా చేస్తున్న పూజా హెగ్డే.. ఆ అందాల‌కు ఫిదా అవ్వాల్సిందే..!

Pooja Hegde : పూజా హెగ్డే కొద్ది రోజులుగా త‌న క్యూట్ లుక్స్‌తో కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. మాయ చేయగల అందం.. అద్భుతమైన నటన.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఫలితంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను, రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. తెలుగులోనే కాదు.. వేరే భాషల్లోనూ ఈ చిన్నది ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యమ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :19 June 2022,1:00 pm

Pooja Hegde : పూజా హెగ్డే కొద్ది రోజులుగా త‌న క్యూట్ లుక్స్‌తో కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. మాయ చేయగల అందం.. అద్భుతమైన నటన.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఫలితంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను, రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. తెలుగులోనే కాదు.. వేరే భాషల్లోనూ ఈ చిన్నది ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోంది.

ఇందులో భాగంగానే తాజాగా పూజా హెగ్డే కొన్నిఫొటోల‌ను షేర్ చేసింది. ఇందులో పూజా హెగ్డే చాలా క్యూట్‌గా, స్ట‌న్నింగ్‌గా క‌నిపిస్తుంది. పూజా లుక్స్ చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ఇటీవ‌ల పూజా హెగ్డే కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తోంది బుట్టబొమ్మ… ఘాటైన అందాలతో వాళ్ళకు నిద్రలేకుండా చేస్తోంది. మాయ చేసే కళ్లతో మత్తెక్కిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పూజా పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.ఆ మధ్య వరుసగా విజయాలను అందుకున్న పూజా హెగ్డే.. ఈ ఏడాది మాత్రం వరుస షాక్‌లతో ఇబ్బందులు పడుతోంది.

httpsthetelugunewscomwp contentuploads202206pooja hegde cute looks are jpg

https://thetelugunews.com/wp-content/uploads/2022/06/pooja-hegde-cute-looks-are-.jpg

Pooja Hegde : పూజా క్యూట్‌నెస్..

ఇటీవలి కాలంలో ఆమె చేసిన ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ మూవీలు భారీ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దీనికితోడు తమిళంలో నటించిన ‘బీస్ట్’ మూవీ కూడా ఆశించిన రీతిలో ఆడలేదు. దీంతో పూజా హెగ్డే మరోసారి సరైన బ్రేక్‌ కోసం వేచి చూడాల్సి వచ్చింది. సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా పూజా హెగ్డే వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంటోంది. అయితే, ఇప్పుడామె హరీశ్ – పవన్ కలయికలో వచ్చే ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీ నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ – మహేశ్ కాంబోలో రానున్న సినిమాలో నటిస్తుందో లేదో తెలియట్లేదు. కానీ, విజయ్ దేవరకొండ ‘జన గణ మన’లో భాగమైంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది