Pooja Hegde : మాల్దీవుల్లో పూజా హెగ్డే ఎంజాయ్‌మెంట్ ఈ రేంజ్‌లో ఉంది.. వీడియోలో మొత్తం చెప్పేసిందిగా..!

Authored By Sam C | The Telugu News | Updated on: February 19, 2022, 11:48 am

Pooja Hegde : అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే అటు ప‌ర్స‌న‌ల్ ఇటు ప్రాఫెష‌న‌ల్ లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది.బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మొన్నటి వరకు అగ్రహీరోయిన్ గా గుర్తింపును అందుకున్న పూజాహెగ్డే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అయితే చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే తమిళంలో మరో పెద్ద సినిమాను విడుదలకు సిద్ధం చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో చేసిన బీస్ట్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

హిందీలో కూడా పూజా హెగ్డే ప‌లు సినిమాలు చేస్తుంది. క్ష‌ణం తీరిక లేకుండా కాలం గడుపుతున్న పూజా హెగ్డే రీసెంట్‌గా త‌న ఫ్యామిలీతో మాల్దీవుల‌కి వెళ్లింది. అక్క‌డ ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. అంతేకాదు అందాలు ఆర‌బోయ‌డం, త‌న సినిమాకు ప్ర‌మోష‌న్స్ చేసుకోవ‌డం వంటివి చేసుకుంది. రీసెంట్‌గా మాల్దీవుల‌లో తాను ఎలా ఎంజాయ్ చేసిందో ఓ వీడియో ద్వారా చూపించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. ప్ర‌తి ఒక్క‌రు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు.

pooja hegde enjoyed in maldives

pooja hegde enjoyed in maldives

Pooja Hegde : పూజా ర‌చ్చ మాములుగా లేదుగా..

పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన పూజా హెగ్డే గతేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆమె నటించిన తమిళ సినిమా బీస్ట్ నుంచి అరబిక్ కుతు తాజాగా యూట్యూబ్‌లో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. థలపతి విజయ్ హీరోగా చేశారు. ఇక ప్రస్తుతం మాల్దీవ్స్‌‌లో ఉన్న పూజా అక్కడి అందాలను ఆస్వాదిస్తూ కనులవిందు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp