Pooja Hegde : పూజా హెగ్డే, ర‌ష్మిక మంద‌న్న మ‌ధ్య వార్ పీక్స్ లోకి వెళ్లిందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pooja Hegde : పూజా హెగ్డే, ర‌ష్మిక మంద‌న్న మ‌ధ్య వార్ పీక్స్ లోకి వెళ్లిందా?

 Authored By sandeep | The Telugu News | Updated on :14 July 2022,9:00 pm

Pooja Hegde: పూజా హెగ్డే, ర‌ష్మిక మంద‌న్న ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రి భామ‌ల మ‌ధ్య కాంపిటీష‌న్ చాలా ఉంది. ఈ ఇద్ద‌రు కూడా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్స్‌గా మారారు. అయితే నేష‌న‌ల్ క్ర‌ష్మిక ర‌ష్మిక మంద‌న్న వ‌ర్సెస్ పూజా హెగ్డే మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం ముదిరిపాకాన ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది. పూజా హెగ్డే ఎప్పుడు ఏదో ఒక హీరోయిన్‌పై త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతూనే ఉంటుంది. గ‌తంలో స‌మంత‌కు ఆమె మ‌ధ్య లేనిపోని పొరాపొచ్చాల‌ వ‌చ్చాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా కూడా ఇద్ద‌రి అభిమానుల మ‌ధ్య పెద్ద పెద్ద మాట‌ల యుద్ధాలే న‌డిచాయి.

ఇప్పుడు ర‌ష్మిక వ‌ర్సెస్ పూజా హెగ్డే అన్న‌చందాన మారింది. సౌత్‌లో టాలీవుడ్‌ను క‌మ్మేసిన ర‌ష్మిక అటు బాలీవుడ్‌లో కూడా ఫుల్ బిజీ అయిపోతోంది. ఇదే పూజా అవ‌కాశాల‌కు గండి కొట్టేస్తోంది. చివ‌ర‌కు ర‌ష్మిక సౌత్‌లో మంచి అవ‌కాశాలు వ‌స్తున్నా కాద‌నుకుని మ‌రీ బాలీవుడ్‌కే జై కొడుతోంది. పుష్ప‌తో ర‌ష్మికు వ‌చ్చిన పాన్ ఇండియా ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తూ ప్ర‌స్తుతం ఆమె బాలీవుడ్‌లో మిష‌న్ మ‌జ్ను , గుడ్ బై, యానిమ‌ల్ సినిమాలు చేస్తోంది. అయితే పూజా ఖాతాలో ప‌డాల్సిన ఈ సినిమాలు అన్నీ ఇప్పుడు ర‌ష్మిక ఖాతాలో ప‌డుతున్నాయి.

Pooja Hegde fight with Rashmika Mandanna

Pooja Hegde fight with Rashmika Mandanna

Pooja Hegde : స్ట్రాంగ్ వార్..

దీంతో ర‌ష్మిక వ‌ర్సెస్ పూజా మ‌ధ్య ఇప్పుడు సౌత్ టు నార్త్ ఎక్క‌డ చూసినా ప్ర‌చ్ఛ‌న్న యుద్ధ‌మే న‌డుస్తోందంటున్నారు. ర‌ష్మిక బాలీవుడ్ మీద పూర్తిగా దృష్టి పెడుతుండ‌డంతో పూజా హెగ్డే తెలుగు సినిమాలు ఒప్పుకుంటుంద‌ని అంటున్నారు. బాలీవుడ్ డెబ్యూ మూవీ మెహంజోదారో త‌న కెరీర్‌లోనే చేసిన చెత్త సినిమా అన‌డంతో బాలీవుడ్ మేక‌ర్స్ ఆమెపై పెద్ద‌గా దృష్టి పెట్టడం లేద‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. పూజాకి త‌ల పొగ‌రు చాలా ఎక్కువ అని రానున్న రోజుల‌లో టాలీవుడ్‌లో కూడా పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది