Pooja Hegde : వ‌ణికే చ‌లిలో వేడి పుట్టిస్తున్న పూజా హెగ్డే.. ఆ అందాల‌కు ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే..!

Authored By Sam C | The Telugu News | Published on: January 18, 2022, 8:00 pm

Pooja Hegde: పూజా హెగ్డే.. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రు. త‌న‌దైన అంద‌చందాల‌తో కుర్ర‌కారుకి హీట్ పెంచుతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌లి కాలంలో బికినీతో ర‌చ్చ చేస్తుంది. ఆ మ‌ధ్య సినిమాల‌కు బ్రేక్ తీసుకొని మాల్దీవులకి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ బికినీలో పోజులిస్తూ రెచ్చిపోయింది. తన ఘాటైన అందాల విందుతో కుర్రాళ్లకి విందు భోజనం వడ్డించిందని చెప్పొచ్చు. అక్కడ వారం రోజుల పాటు గ్యాప్‌ లేకుండా ఎంజాయ్‌ చేసింది. ఇప్పుడు మరోసారి గ్లామర్‌ విందుకి తెరలేపింది.

మ‌ళ్లీ త‌న గ్లామ‌ర్ షోకి పని చెప్పింది పూజా హెగ్డే. ఈ రెండు మూడు రోజులుగా బికినీ ఫొటోలు షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది. టూ పీస్‌ బికినీ, థైస్‌ కనిపించేలా ఉన్న పొట్టి షార్ట్ ధరించి పూజా పంచుకున్న పిక్‌ వైరల్‌ అవుతుంది. అభిమానులను మెస్మరైజ్‌ చేస్తుంది. పూజా అంటే సామాజిక మాధ్యమాల్లో భారీ క్రేజ్‌, ఫాలోయింగ్‌ ఉందనే విషయం తెలిసిందే. దీనికి లక్షల్లో వ్యూస్‌ రావడం ఖాయం అంటున్నారు. పూజా తన సెంటిమెంట్ కొనసాగిస్తూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ రూపంలో మరో హిట్ కొట్టింది. ఈ సినిమా విజయం పూజా హెగ్డే పుణ్యమే అని పరిశ్రమ వర్గాలు చెప్పుకోవడం విశేషం.

pooja hegde latest photos in viral

pooja hegde latest photos in viral

Pooja Hegde : పిచ్చెక్కిస్తున్న పూజా..

చిరంజీవి రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ ఆచార్య, ప్రభాస్ రాధే శ్యామ్ వంటి భారీ ప్రాజెక్ట్స్ పూజా హెగ్డే ఖాతాలో ఉన్నాయి. ఐతే సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన రాధే శ్యామ్ క‌రోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దర్శకుడు రాధాకృష్ణ పీరియాడిక్ ఎమోషనల్ లవ్ డ్రామాగా రాధే శ్యామ్ తెరకెక్కించారు. ఇక రాధే శ్యామ్ ట్రైలర్ ఆకట్టుకుంది. మహేష్ తో దర్శకుడు త్రివిక్రమ్ మూవీ ప్రకటించగా… హీరోయిన్ గా పూజా పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే పవన్ తో హరీష్ శంకర్ చేస్తున్న భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో కూడా పూజా నటించే అవకాశం కలదు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp