Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్డే మ‌తులు పోగొడుతుందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్డే మ‌తులు పోగొడుతుందిగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :19 May 2022,7:30 pm

Pooja Hegde : టాలీవుడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఇటీవ‌లి కాలంలో అందాల దాడి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ అమ్మ‌డు చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదు. పూజా తాజాగా 75 కాన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో వైట్ కలర్ గౌనులో కలియ తిరుగుతూ ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేసింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు భార‌త ప్ర‌తినిధిగా పూజా హెగ్డే హాజ‌రు అయ్యారు. ఈ ఏడాది కాన్స్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ వేడు‌క‌లు ఈ నెల 17 నుంచి మొద‌లయ్యాయి.ఇప్పటకే తమన్నా, ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొణే ఈ వేడుకలో సందడి చేసారు. ఈ వేడుకలు అక్కడ ఈ నెల 28 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. ఈ వేడుక‌ల్లో భార‌త ప్ర‌తినిధుల్లో ఒకరిగా నటి పూజ హెగ్డే హాజ‌రైంది.

తమ అభిమాన నటికి ఈ గౌరవం దక్కినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్‌ బిజీగా ఉన్న హీరోయిన్. దువ్వాడ జగన్నాథం మూవీ నుంచి వరుస సక్సెస్‌లతో ఉన్న ఈ భామ జైత్రయాత్రకు ప్రభాస్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రాధే శ్యామ్’ బ్రేకులు వేసింది. ఇండియన్‌ సినిమాకి సంబంధించిన ప్రతినిధిగా ఆమె అంతర్జాతీయ చిత్రోత్సవ వేడుకలో సందడి చేసే ఛాన్స్ దక్కింది. అక్కడ తన అభిప్రాయం పంచుకునే అవకాశం దక్కింది. ఎంతో మంది హీరోయిన్ల కలలాంటి రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేసే అదృష్టం దక్కింది.ప్రస్తుతం పూజా హెగ్డే కాన్‌ ఫెస్టివల్‌కి సంబంధించిన రెడ్‌ కార్పెట్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Pooja Hegde Latest Video Viral

Pooja Hegde Latest Video Viral

Pooja Hegde : పూజా ర‌చ్చ ఏంది..!

తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆడియెన్స్ ని కట్టిపడేస్తున్నాయి. నెటిజన్లు, ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ అందాల విందుతో పోల్చితే టాలీవుడ్‌లో చూసిందే చాలా తక్కువే అంటున్నారు. టాప్‌ లెస్‌ గౌన్‌లో పూజా హెగ్డే హోయలు పోతూ నెటిజన్ల మతిపోగొడుతుంది. ఇక కాన్‌ ఫెస్టివల్‌లో ఫోటోగ్రాఫర్లు, కెమెరా కన్నులు పూజా అందాలను పోటి పడటం విశేషం. కెమెరా పోటీకి పూజా మరింతగా రెచ్చిపోయిందని చెప్పొచ్చు. తన అందాల ఘాటేంటో కాన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌కి, ప్రపంచ ఆడియెన్స్ కి, సెలబ్రిటీలకు పరిచయం చేసిందని చెప్పొచ్చు. ప్ర‌స్తుతం పూజా పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Gulte (@gulteofficial)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది