Keerthy Suresh : పూజా హెగ్డే, రష్మిక మందన్నలకు ఝలక్ ఇచ్చిన మహానటి కీర్తి సురేష్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Keerthy Suresh : పూజా హెగ్డే, రష్మిక మందన్నలకు ఝలక్ ఇచ్చిన మహానటి కీర్తి సురేష్ ..!

 Authored By govind | The Telugu News | Updated on :12 June 2022,1:30 pm

Keerthy Suresh : టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ఇప్పుడు మాలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలలోనూ క్రేజీ హీరోయిన్స్‌గా వెలుగుతున్నారు. పూజా హెగ్గ్డే, రష్మిక మందన్న. వీరిద్దరిదీ బెంగుళూరు కావడం విశేషం. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పూజా, రష్మిక ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలని ఏలుతున్నారు. ఇద్దరు వరుసబెట్టి ప్రాజెక్ట్స్‌కు సైన్ చేస్తూ షాకిస్తున్నారు. పూజా హెగ్డే చేతిలో హిందీలో సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ సినిమాలున్నాయి. రష్మికకు అమితాబ్, రణ్‌వీర్ సింగ్, వరుణ్ ధావన్ సినిమాలతో పాటు మరో సినిమా కూడా ఉంది.ఇక తెలుగులో రష్మిక పుష్ప 2లో నటించాల్సి ఉంది.

ప్రస్తుతం తమిళ హీరో విజయ్ నటిస్తున్న బై లింగ్వల్ సినిమా చేస్తోంది. దిల్ రాజు దీనికి నిర్మాత కాగా, వంశీపైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, పూజా హెగ్డే పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు సినిమాలు చేయాల్సి ఉండగా..చాలా నెలల నుంచి ఈ ప్రాజెక్ట్స్ డిలే అవుతూ వస్తున్నాయి. దాంతో వీటికి టాటా చెప్పి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇటీవల మొదలైన జనగణమన సినిమాలో నటించడానికి కమిటైంది.అంతేకాదు, తమిళంలో సూర్య సినిమా, కన్నడలో యష్ సినిమాలు చేయబోతుంది అంటున్నారు.

Pooja Hegde Rashmika Mandanna Ki Jhalak given by Keerthi Suresh

Pooja Hegde, Rashmika Mandanna Ki Jhalak given by Keerthi Suresh

Keerthy Suresh : అందుకే..ఈ ఝలక్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.

ఇంత జోరు మీదున్న వీరికి సర్కారు వారి పాట సినిమాలో యమా ఘాటుగా కనిపించిన కీర్తి సురేష్ ఝలక్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. మ మ మహేషా, మురారివా సాంగ్స్‌లో కీర్తి ఒలకబోసిన అందాలకు ఫ్యాన్స్, ప్రేక్షకులు అల్లాడిపోయారు. ఇంతకాలం చూడాలనుకున్న కీర్తి ఇలా సర్‌ప్రైజ్ ఇచ్చి ఊపిరాడనీయకుండా చేసింది. గ్లామర్ గేట్లు ఎత్తేయడంతో పూజా, రష్మిక అనుకున్న మేకర్స్ ఇప్పుడు కీర్తి క్వాల్ షీట్స్ కోసం ట్రై చేస్తున్నారట. వీరిద్దరికంటే కూడా కీర్తి రెమ్యునరేషన్ కాస్త తక్కువే. ఇక అందాల ఆరబోతకు రెడీ అయింది. అందుకే..ఈ ఝలక్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది